ఒకే ట్రేలో మూడు ప్లేట్లు!

డైనింగ్‌ టేబుల్‌ మీద మిగిలిన ఆహార పదార్థాలతో పాటూ చాలామంది పండ్లూ, రకరకాల స్నాక్సూ ఉంచుతారు. కానీ వాటిని విడివిడిగా ఒక్కో పాత్రలో ఉంచడానికి బదులు ఒకేదాంట్లో వేసుకోవచ్చు.

Published : 21 Apr 2024 00:00 IST

డైనింగ్‌ టేబుల్‌ మీద మిగిలిన ఆహార పదార్థాలతో పాటూ చాలామంది పండ్లూ, రకరకాల స్నాక్సూ ఉంచుతారు. కానీ వాటిని విడివిడిగా ఒక్కో పాత్రలో ఉంచడానికి బదులు ఒకేదాంట్లో వేసుకోవచ్చు. ‘అదెలా కుదురుతుంది, అవన్నీ కలగలిసిపోవూ’ అంటారేమో... అలా ఏం జరగదు. ఎందుకంటే ఈ ‘ఫోల్డబుల్‌ మల్టీ లేయర్‌ ట్రే’లోంచి మూడు ప్లేట్లను విడివిడిగా తీసుకుని, ఒక్కోదాంట్లో ఒక్కోరకమైన పదార్థాల్ని వేసుకోవచ్చు. అంతేకాదు, అవసరం లేకపోతే ఈ ట్రేని పూర్తిగా మడతపెట్టి పక్కన పెట్టేయొచ్చు. ఇంట్లోనే కాదు, సరదాగా ఎక్కడికైనా పిక్నిక్‌కి వెళ్లినప్పుడూ ఇది బాగానే ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..