ఇంటి మందిరానికి దీపాల తోరణం!

పూజగది ప్రత్యేక శోభతో కనిపించాలనుకునే గృహిణులందరూ- పీఠం మీద ఉంచే దేవుని పటం దగ్గర్నుంచి పూజామందిరపు అలంకరణల వరకూ అన్నింటిపైనా దృష్టిపెడతారు.

Published : 21 Apr 2024 00:03 IST

పూజగది ప్రత్యేక శోభతో కనిపించాలనుకునే గృహిణులందరూ- పీఠం మీద ఉంచే దేవుని పటం దగ్గర్నుంచి పూజామందిరపు అలంకరణల వరకూ అన్నింటిపైనా దృష్టిపెడతారు. వాళ్ల అభిరుచిని దృష్టిలో పెట్టుకునే మార్కెట్లోనూ పూజాసామగ్రి కొత్తకొత్తగా వస్తోంది. అందులో భాగంగానే ‘డ్యూయల్‌ స్టాండ్‌ మల్టిపుల్‌ విక్స్‌ ల్యాంప్‌’ పేరుతో రకరకాల ఇత్తడి దీపాల తోరణాలు వచ్చాయి. అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకూ ఉండే వీటిని మనకు కావాల్సిన సైజుల్లో కస్టమైజ్‌ కూడా చేయించుకోవచ్చు. పూజగదిలో రెండువైపులా ఉంచే దీపపు కుందులకు బదులుగా అటూ, ఇటూ, పైనా తోరణంలా ఉండే ఈ ఒక్క దీపపు స్టాండ్‌ని ఎంచుకుని చూడండి. పూజగది అంతా ఆధ్యాత్మిక శోభను నింపుతూనే... పూజలూ, వ్రతాలప్పుడు వచ్చినవారిని మరింతగా ఆకట్టుకుంటుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..