చిట్టి పొట్టి మొక్కలు!

బాల్కనీలోనే కాదు, చాలామంది ఇంటి లోపలా అలంకరణలో భాగంగా అక్కడక్కడా అందమైన మొక్కల కుండీల్ని పెట్టుకుంటారు. వీటిల్లో ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపించే సక్యులెంట్‌ మొక్కల్నే ఎంచుకుంటారు.

Published : 21 Apr 2024 00:04 IST

బాల్కనీలోనే కాదు, చాలామంది ఇంటి లోపలా అలంకరణలో భాగంగా అక్కడక్కడా అందమైన మొక్కల కుండీల్ని పెట్టుకుంటారు. వీటిల్లో ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపించే సక్యులెంట్‌ మొక్కల్నే ఎంచుకుంటారు. చూడ్డానికి బాగుండటంతోపాటు ఈ మొక్కల నిర్వహణకు తక్కువ స్థలం సరిపోవడమే కాదు, శ్రమా కొంచమే ఉంటుంది. మామూలు మొక్కలతో పోల్చితే చిన్నగా ఉండే సక్యులెంట్లలో ఇప్పుడు- మినీ సక్యులెంట్లు వచ్చాయి. బొటనవేలంత సైజులో రకరకాల రంగుల్లో ముచ్చటగా ఉంటాయివి. చిట్టి కుండల్లో ఈ పొట్టి మొక్కల్ని వేసి ఏ టీపాయ్‌ మీదనో ఉంచామంటే భలేగా ఉంటుంది. కావాలంటే ఒకే దాంట్లో రకరకాల మినీ సక్యులెంట్లని కలిపి అందమైన మొక్కల కుండీని సొంతంగా తయారు చేసుకోవచ్చు. నచ్చినట్టు కస్టమైజ్‌ చేసివ్వడానికి ఆన్‌లైన్‌ సైట్లూ అందుబాటులో ఉన్నాయి. మొక్కలంటే ఇష్టపడే మీ సన్నిహితులకు ప్రత్యేక సందర్భాలప్పుడు ఈ వెరైటీ మొక్కల కుండీని బహుమతిగా ఇచ్చారంటే... ముద్దొచ్చే ఆ మొక్కల్ని చూసి మురిసిపోతారంటే నమ్మండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..