రోలుకీ మూత పెట్టేద్దాం!

పొడులు పట్టుకోవడానికి ఎన్ని రకాల మిక్సీలు వచ్చినా... అప్పటికప్పుడు పోపులోకి వెల్లుల్లో, టీలోకి అల్లమో దంచుకోవడానికి మాత్రం చాలావరకూ అందరి ఇళ్లల్లో చిన్న రోలు తప్పనిసరిగా ఉంటుంది.

Published : 04 May 2024 23:46 IST

పొడులు పట్టుకోవడానికి ఎన్ని రకాల మిక్సీలు వచ్చినా... అప్పటికప్పుడు పోపులోకి వెల్లుల్లో, టీలోకి అల్లమో దంచుకోవడానికి మాత్రం చాలావరకూ అందరి ఇళ్లల్లో చిన్న రోలు తప్పనిసరిగా ఉంటుంది. అన్ని వస్తువుల్లో సౌకర్యాలు వస్తుంటే రోలులో మాత్రం ఎందుకు రాకూడదను కున్నారేమో- మూతతో ఉన్న రోలును తీసుకొచ్చేశారు. మామూలుగా రోట్లో ఏమైనా వేసి దంచుతుంటే అవి బయటకి చిందిపోతుంటాయి. దాని వల్ల మళ్లీ రోలు చుట్టూ శుభ్రం చేయాల్సి వస్తుంది. అదే మూత పెట్టేసి దంచుకున్నామంటే, ఆ ఇబ్బందే ఉండదు. స్టీలూ, మార్బులూ, చెక్కతో వచ్చే రకరకాల రోళ్లూ ఇప్పుడు మూతతోనే వస్తున్నాయి. అంతేకాదు, కొన్నేమో పనయ్యాక రోకలిని మూతపైనే పెట్టేలానూ ఉన్నాయి. కిచెన్‌ వస్తువుల్లో వచ్చే మార్పు- ఇంత చిన్నదైనా గృహిణుల్ని ఆకట్టుకోకుండా ఉంటుందా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు