నీళ్లూ... నోరూరించేలా!

వేసవిలో  బయటకు వెళ్లామంటే మనతో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా వాటర్‌ బాటిల్‌ని కచ్చితంగా వెంట తీసుకెళుతుంటాం.

Published : 04 May 2024 23:48 IST

వేసవిలో  బయటకు వెళ్లామంటే మనతో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా వాటర్‌ బాటిల్‌ని కచ్చితంగా వెంట తీసుకెళుతుంటాం. అందుకే కొందరు ఆ బాటిల్స్‌లోనే వెరైటీనీ కోరుకుంటూ మార్కెట్లో వచ్చే కొత్తరకాల్ని ట్రై చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈమధ్య ఫ్లేవర్‌ పాడ్స్‌ వాటర్‌ బాటిళ్లు వచ్చాయి. బాటిల్‌తో పాటూ కమ్మని వాసనలు వెదజల్లే వాటర్‌ పాడ్స్‌ జతగా వస్తాయి. నిమ్మ, నారింజ, మామిడి, బొప్పాయి... ఇలా రకరకాల పండ్ల వాసనలతో ఉండే వీటిని బాటిల్‌ మూత దగ్గర పెట్టుకోవచ్చు. ఆహారం- తినడానికి ముందే వాసనలతో ఘుమఘుమలాడినట్టు... బాటిల్‌లోని నీళ్లూ- పండ్ల వాసనల్ని వెదజల్లుతాయి. కావాలంటే ఈ ఫ్లేవర్‌ పాడ్స్‌ విడిగానూ దొరుకుతున్నాయి. సమయానికి నీళ్లు తాగడాన్నీ వాసనతోనే గుర్తుచేసేలా ఉండే ఈ రుచుల పాడ్స్‌ భలేగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..