సరికొత్త దీపాల స్టాండ్లు!

రోజూ పూజ గదిలోనో, తులసికోట దగ్గరో, ప్రత్యేక పూజలప్పుడో దీపాల్ని వెలిగించి వాటిని దీపపు స్టాండ్ల మీద ఉంచుతారు.

Published : 04 May 2024 23:49 IST

రోజూ పూజ గదిలోనో, తులసికోట దగ్గరో, ప్రత్యేక పూజలప్పుడో దీపాల్ని వెలిగించి వాటిని దీపపు స్టాండ్ల మీద ఉంచుతారు. కొంతమంది దీపాల కింద ముగ్గులూ వేస్తుంటారు. మరికొందరు గోడలపైన దేవుడి పటాలు తగిలించి దీపం వెలిగించడానికి ఇతర ఏర్పాట్లూ చేసుకుంటారు. అలాంటి గృహిణు లందరి కోసమే దేవుళ్ల చిత్రాలతో ముగ్గులు వేసి ఉన్న కొత్తరకం దీపాల స్టాండ్లు దొరుకుతున్నాయి. వీటిని, కావాలంటే మందిరంలో దీపాల స్టాండుల్లా వాడుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా దేవుడి చిత్రపటాల అవసరం లేకుండా ఇష్టదైవంతో ఉన్న ఈ దియా స్టాండ్లనే పెట్టుకోవచ్చు. గణపతి, లక్ష్మి, వేంకటేశ్వరస్వామి, శివుడు, సత్యనారాయణ స్వామి... ఇలా దేవుళ్ల చిత్రాలన్నింటితోనూ దొరుకుతున్నాయివి. పూజలూ, వ్రతాల్లో రిటర్న్‌ గిఫ్టులుగా బాగుంటాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..