బాల్కనీలో ఓ సోలార్‌ లైట్‌!

ఇంటి బయటా, బాల్కనీలో పెట్టుకునే బల్బుల్లో మామూలు వాటికన్నా ఇక్కడున్న ‘మోషన్‌ సెన్సర్‌ లెడ్‌ సోలార్‌ లైట్‌’ను ఎంచుకోవచ్చు.

Published : 05 May 2024 00:21 IST

ఇంటి బయటా, బాల్కనీలో పెట్టుకునే బల్బుల్లో మామూలు వాటికన్నా ఇక్కడున్న ‘మోషన్‌ సెన్సర్‌ లెడ్‌ సోలార్‌ లైట్‌’ను ఎంచుకోవచ్చు. స్టికర్‌ తీసి ఈ లైట్‌ని గోడకు సులువుగా అతికించుకోవచ్చు. రోజంతా సూర్యరశ్మిని తీసుకుంటూ రాత్రివేళ చీకట్లో వెలుగుతుంది. పైగా దీంట్లో మూడు రకాల ఆప్షన్లను పెట్టుకోవచ్చు. మోషన్‌ సెన్సర్‌తో ఉండే ఈ సోలార్‌ లైట్‌... ఏవైనా కదలికలు ఉన్నప్పుడు మాత్రమే వెలిగేలా, కదలికలు ఉన్నప్పుడు ఎక్కువ వెలుగుతో ఉండి, ఎవరూ లేనప్పుడు తక్కువ కాంతి వచ్చేలా, లేదంటే నిరంతరం వెలిగేలా... ఇలా మనకు కావాల్సినట్టు లైట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ లైట్‌ని అమర్చడమూ తేలికే, పైగా దీని ధరా అందుబాటులోనే ఉంది. మరెందుకాలస్యం, ఈ వాటర్‌ప్రూఫ్‌ సోలార్‌ లైట్‌ను ఇంటికి తెచ్చేసుకుని, కరెంట్‌ బిల్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..