అప్పటికప్పుడు చల్లగా...

టీవీ చూస్తూ పక్కన చల్లనినీళ్ల సీసా పెట్టుకున్నామా అవి కాసేపటికే వేడెక్కిపోతున్నాయి... స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నప్పుడు మధ్యమధ్య లేచి చల్లని నీళ్లూ, జ్యూసుల్లాంటివి అందించాలంటే పెద్ద పని అంటూ ఫిర్యాదు చేసేవారికి ఇప్పుడు ‘ఎలక్ట్రిక్‌ కప్‌ కూలర్‌’ అందుబాటులోకి వచ్చింది.

Published : 19 May 2024 00:39 IST

టీవీ చూస్తూ పక్కన చల్లనినీళ్ల సీసా పెట్టుకున్నామా అవి కాసేపటికే వేడెక్కిపోతున్నాయి... స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నప్పుడు మధ్యమధ్య లేచి చల్లని నీళ్లూ, జ్యూసుల్లాంటివి అందించాలంటే పెద్ద పని అంటూ ఫిర్యాదు చేసేవారికి ఇప్పుడు ‘ఎలక్ట్రిక్‌ కప్‌ కూలర్‌’ అందుబాటులోకి వచ్చింది. పర్సనల్‌ ఐస్‌ బకెట్‌/మినీ ఫ్రిజ్‌ పేర్లతోనూ పిలిచే ఈ పరికరం ఫ్రిజ్‌, ఐసుముక్కలతో సంబంధం లేకుండా ఏ పానీయాన్నయినా అప్పటికప్పుడు చల్లగా తాగాలనుకునేవారికి చక్కని ఎంపికవుతుంది. ఈ పరికరంపైన ఉండే కప్పులో నీళ్లు, జ్యూస్‌, పాలు, పెరుగు... ఇలా కావాల్సినదాన్ని వేసుకుని స్టార్ట్‌ బటన్‌ని నొక్కితే చాలు. నిమిషాల వ్యవధిలో అవి చల్లగా అయిపోతాయి. ఐసు లేదా ఫ్రిజ్‌ అందుబాటులో ఉండని ప్రయాణాల సమయంలో, ఆఫీసులో ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..