కోటలో తోటలు!

మొక్కలంటే ఇష్టపడేవాళ్లు- వాటిని పెంచే కుండీలపైనా ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఏదో ఒక మట్టి కుండీని కాకుండా ఇంటి అలంకరణలో అదీ ఒక భాగమయ్యేలా చూసుకుంటారు.

Published : 19 May 2024 00:40 IST

మొక్కలంటే ఇష్టపడేవాళ్లు- వాటిని పెంచే కుండీలపైనా ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఏదో ఒక మట్టి కుండీని కాకుండా ఇంటి అలంకరణలో అదీ ఒక భాగమయ్యేలా చూసుకుంటారు. అలాంటి ప్లాంట్‌ లవర్స్‌ను ఆకట్టు కోవడానికే మార్కెట్లోనూ కొత్తరకం మొక్కలతోపాటూ కుండీలూ సరికొత్త సొబగులతో వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా వచ్చినవే ఇక్కడున్న విల్లా గార్డెన్‌ టవర్లూ, క్యాజిల్‌ ప్లాంటర్లు. చిన్నచిన్న మెట్లూ, కిటికీలూ, ప్రహరీలతో ఉండే ఈ కుండీలు ముచ్చటైన కోటల్లా, మినియేచర్‌ భవనాల్లా భలేగా కనిపిస్తాయి. బాల్కనీ గార్డెన్‌లో రంగుల పూల మొక్కలతో ఉంచిన ఈ అందమైన విల్లాల కుండీల్ని చూసినవారంతా ‘అరె మొక్కలకూ కోటలు కట్టేశారా’ అంటూ మీ అభిరుచిని మెచ్చుకుని తీరుతారంతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..