పిల్లల ఎత్తు స్మార్ట్‌గా కొలిచేద్దాం!

పిల్లలు వయసుకు తగ్గట్టు పెరుగుతున్నారా... వాళ్ల ఎత్తూబరువులు సరిగ్గానే ఉన్నాయా... అంటూ అమ్మానాన్నలకు ఎన్నో సందేహాలు. అందుకే నెలల వయసు నుంచి ఎప్పటికప్పుడు చిన్నారుల ఎత్తూబరువుల్ని చెక్‌ చేస్తూనే ఉంటారు.

Published : 19 May 2024 00:42 IST

పిల్లలు వయసుకు తగ్గట్టు పెరుగుతున్నారా... వాళ్ల ఎత్తూబరువులు సరిగ్గానే ఉన్నాయా... అంటూ అమ్మానాన్నలకు ఎన్నో సందేహాలు. అందుకే నెలల వయసు నుంచి ఎప్పటికప్పుడు చిన్నారుల ఎత్తూబరువుల్ని చెక్‌ చేస్తూనే ఉంటారు. కానీ పిల్లల్ని ఒకచోట నిల్చోబెట్టి ఆ కొలతలు చూడటమూ, వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవడమూ కాస్త కష్టమే. అలా కాకుండా ఆడుతూపాడుతూనే వాళ్ల ఎత్తూ బరువుల్ని కొలవాలంటే... ఇక్కడున్న ‘కీకో లేజర్‌ హైట్‌ మెజరర్‌ అండ్‌ స్మార్ట్‌ స్కేల్‌’ని ప్రయత్నించొచ్చు.

ఈ లేజర్‌ హైట్‌ మెజరర్‌ని తలపైన ఉంచగానే తెరమీద ఎత్తు కనిపించేస్తుంది. అలాగే స్మార్ట్‌ స్కేల్‌ మీద నిల్చోబెట్టగానే బరువుతోపాటూ చిన్నారుల బాడీ మాస్‌ ఇండెక్స్‌... బుజ్జాయిల శరీరంలోని కొవ్వు, నీటి శాతాలు... ఇంకా ఎముకల, కండరాల మాస్‌ వివరాలన్నీ చూపిస్తుందది. పైగా ఈ సమాచారమంతటినీ ఆప్‌ ద్వారా ఫోన్లో రికార్డు చేసుకోవచ్చు. పిల్లల బీఎంఐని సులువుగా చూపే ఈ లేజర్‌ స్కేల్‌ ఎంతో ఉపయోగం కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..