ప్రయాణానికీ ఉందో కిట్‌

సెలవుల్లో పిల్లల్ని తీసుకుని నాలుగైదు రోజులు ఎక్కడికైనా వెళ్లి రావాలంటే ముందునుంచీ ఎన్నో చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ప్రతి వస్తువునూ సిద్ధంచేయడంతోపాటు పెద్దవాళ్లూ ఎన్నో సర్దుకోవాల్సి ఉంటుంది.

Published : 19 May 2024 00:43 IST

సెలవుల్లో పిల్లల్ని తీసుకుని నాలుగైదు రోజులు ఎక్కడికైనా వెళ్లి రావాలంటే ముందునుంచీ ఎన్నో చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ప్రతి వస్తువునూ సిద్ధంచేయడంతోపాటు పెద్దవాళ్లూ ఎన్నో సర్దుకోవాల్సి ఉంటుంది. ఊరెళ్లే హడావుడిలో ఏది మర్చిపోయినా ఇబ్బంది తప్పదు అనేవారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ట్రావెల్‌ కిట్లు దొరుకుతున్నాయి. అంటే... పేస్టు, సబ్బు, షాంపూ, క్రీమ్‌, లోషన్‌, వాడిపారేసే తువాళ్లు, దువ్వెన... ఇలా ఈ కిట్‌లో ప్రతి వస్తువూ ఉంటుంది. అదే పురుషులకైతే షేవింగ్‌ సామగ్రి అదనం.

పైగా ఇవి నాలుగు, అయిదు, వారం రోజులకు వాడుకునేలానూ అందమైన పౌచ్‌లో ప్యాక్‌చేసి మరీ ఉంటాయి కాబట్టి ఆ వస్తువుల్ని ఇంటినుంచి తీసుకెళ్లాల్సిన పనిలేకుండా అవసరమైనదాన్ని కొనుక్కుంటే సరిపోతుంది. వీటిల్లోనే అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు ఎమర్జెన్సీ ఫ్యాషన్‌కిట్‌ కూడా ఉంది. గుండీలు లేదా హుక్కులు ఊడిపోయినా, దుస్తులపైన మరకలు పడినా, కుట్లు ఊడిపోయినా.. కొత్తచోట కంగారుపడకుండా ఈ కిట్‌లోనే సేఫ్టీపిన్నులు, సూదీదారం, గుండీలు, హుక్కులు, మరకల్ని తొలగించే రిమూవర్‌ అన్నీ కలిపి వస్తాయన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..