పొగ వచ్చే రైలుబొమ్మ!

పిల్లల ముందు ఎన్ని బొమ్మలు ఉంచినా ఎందుకో రైలుబండి బొమ్మనే ఎక్కువగా ఇష్టపడతారు.

Published : 25 May 2024 23:58 IST

పిల్లల ముందు ఎన్ని బొమ్మలు ఉంచినా ఎందుకో రైలుబండి బొమ్మనే ఎక్కువగా ఇష్టపడతారు. మరి అంతలా నచ్చే బొమ్మ నిజమైన రైలులానే చుక్‌ చుక్‌మంటూ శబ్దాలు చేస్తూ, పొగలు కక్కుతూ, పట్టాలపైన పరుగులు తీస్తుంటే ఇంకెంత థ్రిల్‌ అవుతారు! చిన్నారులకు ఆ ఆనందాన్ని ఇవ్వడానికే స్ప్రే స్టీమ్‌ ట్రైన్‌ టాయ్‌ దొరుకుతోంది. బ్యాటరీలతో ఉండే ఈ రైలు బొమ్మని ఆన్‌ చేయగానే లైట్లతో వెలుగుతూ ముందుకు కదులుతుంది. ముందరున్న మూత తీసి నీళ్లు పోస్తే పొగలు కక్కుతూ పరిగెడుతుంది. మ్యాజిక్‌లా అలా పొగలు వస్తుంటే చిన్నారులకు భలే సరదాగా ఉంటుంది. మీ పిల్లల్ని ఆశ్చర్యపరచాలనుకుంటే... ఎన్నో వెరైటీల్లో అందుబాటులో ఉన్న ఈ రైలు బొమ్మల్లో నచ్చిన ట్రైన్‌ను ఇంటికి తెచ్చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..