బొమ్మ పక్కనే రంగులూ...

నలుపూతెలుపుల్లోని బొమ్మల్ని నచ్చిన రంగులతో అందంగా మార్చడమంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అందుకే రకరకాల కలరింగ్‌ బుక్స్‌ని కొనుక్కుంటారు.

Published : 26 May 2024 01:09 IST

నలుపూతెలుపుల్లోని బొమ్మల్ని నచ్చిన రంగులతో అందంగా మార్చడమంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అందుకే రకరకాల కలరింగ్‌ బుక్స్‌ని కొనుక్కుంటారు. అయితే వాటికి రంగులు అద్దడానికి విడిగా వాటర్‌ కలర్స్‌, పెయింటింగ్‌ బ్రష్‌ల సెట్‌ అంతా ఉండాల్సిందే. అలా కాకుండా పుస్తకంలోనే కలరింగ్‌ పేపర్లతోపాటూ వాటర్‌ కలర్స్‌, బ్రష్‌లూ వస్తే ఎంత సౌకర్యంగా ఉంటుంది. ఇదిగో ఆ వీలును తీసుకొస్తూ వచ్చిందే ‘ప్యాకెట్‌ వాటర్‌ కలరింగ్‌ బుక్‌’. ఇదీ మామూలు కలరింగ్‌ బుక్‌లానే బొమ్మలతో ఉంటుంది కానీ పక్కనే రంగులూ ఉంటాయి. నీళ్లతో వాటిపైన అద్దుతూ ఆ రంగుల్ని బొమ్మలపైన వేయొచ్చు. ప్రయాణాల్లో చిన్నారులు సరదాగా రంగులు వేయడానికి ఈ ఒక్క పుస్తకాన్ని తీసుకెళితే చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు