ఈ క్యాండీల్ని తొక్క తీసే తినాలి!

చాక్లెట్‌, బిస్కెట్‌, క్యాండీ... ఇలా ఏదైనా కానీ రుచితోపాటూ రూపంలోనూ కాస్త వెరైటీగా కనిపిస్తేనే పిల్లల్ని మరింత ఆకట్టుకుంటుంది. అది దృష్టిలో పెట్టుకునే తయారీదారులు రకరకాల బొమ్మలతో వచ్చే తినుబండారాల్ని మార్కెట్లోకి తీసుకొస్తుంటారు.

Published : 26 May 2024 01:11 IST

చాక్లెట్‌, బిస్కెట్‌, క్యాండీ... ఇలా ఏదైనా కానీ రుచితోపాటూ రూపంలోనూ కాస్త వెరైటీగా కనిపిస్తేనే పిల్లల్ని మరింత ఆకట్టుకుంటుంది. అది దృష్టిలో పెట్టుకునే తయారీదారులు రకరకాల బొమ్మలతో వచ్చే తినుబండారాల్ని మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. ఇక్కడున్న పీలబుల్‌ గమ్మీ క్యాండీ కూడా అలా తయారైందే. మామిడి, అరటి, ద్రాక్ష పండ్ల రుచులతో ఉండటమే కాదు, అచ్చంగా వాటిని తిన్న అనుభూతిని ఇవ్వడానికే ఇలా సరికొత్తగా ఆయా పండ్లలా పీలబుల్‌ రూపంలో వచ్చాయి. తొక్కతీసి అరటి పండును ఒలిచినట్టుగా పైనున్న పొరను తొలగించి లోపలున్న గమ్మీని గుటుక్కుమనిపించొచ్చు. పల్చని ఎలాస్టిక్‌ జెల్‌తో తయారుచేసిన బయటి పొర తీసిపారేసేదే అయినా దానివల్ల లోపలున్న గమ్మీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. పుట్టినరోజులప్పుడు ఈ క్యాండీల్ని పంచారంటే- చూడ్డానికీ, తినడానికీ బుజ్జాయిలకు తమషాగా ఉంటుంది మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..