డిజైనర్‌ కత్తెరలొచ్చాయ్‌!

గ్రీటింగ్‌ కార్డులూ, ఫొటోఫ్రేములూ, చార్ట్‌ పేపర్లూ తయారుచేసేప్పుడు కాగితపు అంచుల్ని అందంగా వంపులు వంపులుగా కత్తిరించాలంటే... పిల్లలకే కాదు, పెద్దలకూ చాలా సమయం పట్టేస్తుంది.

Published : 26 May 2024 01:12 IST

గ్రీటింగ్‌ కార్డులూ, ఫొటోఫ్రేములూ, చార్ట్‌ పేపర్లూ తయారుచేసేప్పుడు కాగితపు అంచుల్ని అందంగా వంపులు వంపులుగా కత్తిరించాలంటే... పిల్లలకే కాదు, పెద్దలకూ చాలా సమయం పట్టేస్తుంది. అదే క్షణాల్లో కాగితం చుట్టూ డిజైన్‌ అంచుల్ని తేవాలనుకుంటే మాత్రం ఇక్కడున్న జిగ్‌జాగ్‌ పేపర్‌ షేపర్‌ సిజర్స్‌ని వాడితే సరి. మామూలుగా కత్తిరిస్తూనే పేపర్‌కి రకరకాల డిజైన్లు తేచ్చేయొచ్చు. వేరు వేరు కటింగ్‌ బ్లేడ్స్‌తో వీటిల్లో బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు, ఆకులూ, పువ్వులూ, జంతువులూ, పక్షులూ, పండ్లూ... ఇలా ఎన్నెన్నో ముద్దొచ్చే ఆకారాల్లో కాగితాల్ని అలంకరించుకోవడానికి షేప్‌ పేపర్‌ పంచ్‌ సెట్‌ కూడా దొరుకుతోంది. ఈ వెరైటీ కత్తెరల్నీ, పంచ్‌ సెట్‌నీ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ చేసే పిల్లలకు బహుమతిగా ఇచ్చి చూడండి... కచ్చితంగా తమ ఆర్ట్‌లో ఇంకాస్త సృజనను చూపిస్తారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..