పెరటితోటకో గార్డెన్‌ కిట్‌

చాలామంది గృహిణులు- అందుబాటులో ఉన్న చిన్న బాల్కనీ స్థలంలోనూ రకరకాల మొక్కల్ని పెంచి దాన్నే చిట్టి తోటలానూ మార్చుకుంటున్నారు.

Published : 09 Jun 2024 01:08 IST

చాలామంది గృహిణులు- అందుబాటులో ఉన్న చిన్న బాల్కనీ స్థలంలోనూ రకరకాల మొక్కల్ని పెంచి దాన్నే చిట్టి తోటలానూ మార్చుకుంటున్నారు. కానీ వాటిని పెంచడమంటే చిన్న విషయమేమీ కాదు, సమయానికి నీళ్లు పోయడం, చీడపీడలు గమనించుకోవడం, మొక్క పెరిగే దిశను పరిశీలిస్తూ అందుకు తగ్గట్టు కత్తిరించుకోవడం... ఇలా బోలెడన్ని జాగ్రత్తలూ అవసరమే. వాటిని పాటించడానికి రకరకాల పనిముట్లూ కావాల్సిందే. వాటన్నింటినీ విడివిడిగా కొనుక్కునే బదులు మొత్తం కిట్‌లా దొరికితే- ఎంత సౌకర్యంగా ఉంటుంది కదా. ఇదిగో ఆ వీలును అందిస్తూనే మార్కెట్లో రకరకాల గార్డెన్‌ కిట్స్‌ దొరుకుతున్నాయి. మొక్కలు పెట్టడానికి కావాల్సిన టూల్స్‌ దగ్గర్నుంచి గ్లౌజుల వరకూ అన్నీ అందులోనే ఉంటాయి మరి. మొక్కలంటే ఇష్టమున్నవారికి బహుమతిగా ఎప్పుడూ మొక్కల్నే ఇవ్వడం కన్నా ఈ గార్డెన్‌ కిట్‌నూ అందించి చూడండి, కచ్చితంగా ఎంతో సంతోషిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..