అక్వేరియమే కానీ...

బుజ్జిబుజ్జి చేపలు నీటిలో అటూ ఇటూ తిరుగాడుతుంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా. ఆ అనుభూతిని రోజూ పొందడానికి కొంతమంది ఇంట్లోనే అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటారు.

Published : 09 Jun 2024 01:11 IST

బుజ్జిబుజ్జి చేపలు నీటిలో అటూ ఇటూ తిరుగాడుతుంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా. ఆ అనుభూతిని రోజూ పొందడానికి కొంతమంది ఇంట్లోనే అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఎప్పటికప్పుడు నీళ్లను మార్చడం, చేపలకు ఆహారం వేయడం లాంటివి తప్పవు. అందుకే అక్వేరియమంటే ఇష్టమున్నా ఆ పనులన్నీ చేయడం కుదరని వాళ్లు దాని జోలికే వెళ్లరు. కానీ ఈ ‘ఎలక్ట్రిక్‌ ఆర్టిఫిషియల్‌ అక్వేరియం’ తెచ్చుకున్నా మంటే అవేమీ చేయక్కర్లేదు. ఎందుకంటే చూడ్డానికి నిజమైన అక్వేరియంలా కనిపించినా... ఇందులోని చేపలన్నీ ఉత్తుత్తివే. ఈ ఆర్టిఫిషియల్‌ అక్వేరియాన్ని ప్లగ్‌కు కనెక్ట్‌ చేశామంటే...  బొమ్మ చేపలన్నీ నిజమైన చేపల్లా చక్కర్లు కొడుతున్నట్టు భలేగా కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అసలైన అక్వేరియం కాదంటే ఎవరూ నమ్మలేరు మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..