రంగులు మార్చే ఫ్రేములివి!

సాధారణంగా ఫొటోఫ్రేమ్‌, వాల్‌ పెయింటింగ్‌ ఏవైనా రోజంతా ఒకేలా కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడున్న ‘లైటెడ్‌ పెయింటింగ్‌ లెడ్‌ వాల్‌ ఆర్ట్‌’ను చూశారా... ఇది ఒక్కో పూట ఒక్కోలా దర్శనమిస్తుంది.

Published : 09 Jun 2024 01:12 IST

సాధారణంగా ఫొటోఫ్రేమ్‌, వాల్‌ పెయింటింగ్‌ ఏవైనా రోజంతా ఒకేలా కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడున్న ‘లైటెడ్‌ పెయింటింగ్‌ లెడ్‌ వాల్‌ ఆర్ట్‌’ను చూశారా... ఇది ఒక్కో పూట ఒక్కోలా దర్శనమిస్తుంది. నిజమండీ బాబూ... బయట వాతావరణంలోని సహజమైన ఎండా, పగలూ, రాత్రీ, ఇంట్లోని లైట్ల వెలుగులూ తదితరాల ఆధారంగా తెల్లటి చిత్రం కాస్తా రంగులతో వెలుగుతుంది. వెలుతురులోని తేడాల్ని బట్టి ఆ ఫొటోఫ్రేములోనూ రంగులూ మారుతూ ఉంటాయి. యూఎస్‌బీ కేబుల్‌తో కనెక్ట్‌ చేసుకునే వీలున్న ఈ లెడ్‌ పెయింటింగ్‌ల్ని లైట్‌ సెన్సర్లను బట్టి రంగులు కనిపించేలా తయారుచేశారు. ప్రకృతి అందాల్ని ఇష్టపడేవారు ఏదో ఒక ఫొటోఫ్రేమ్‌కు బదులు వీటిని ఎంచుకోవచ్చు. కళ్లముందు బొమ్మలోని కాంతులూ మారిపోతూ నిజమైన ప్రకృతిలా కనువిందుచేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..