వెలిగే విండ్‌ చైమ్స్‌!

చిరుగాలికి అటూ ఇటూ కదులుతూ మనసుకు హాయినిచ్చే శబ్దం చేసే విండ్‌ చైమ్స్‌ని చాలామంది అలంకరణలో భాగంగా పెట్టుకుంటారు.

Published : 09 Jun 2024 01:14 IST

చిరుగాలికి అటూ ఇటూ కదులుతూ మనసుకు హాయినిచ్చే శబ్దం చేసే విండ్‌ చైమ్స్‌ని చాలామంది అలంకరణలో భాగంగా పెట్టుకుంటారు. ఇంట్లో ఓ మూలనో, ఆరుబయట ఓ వారనో ఉంచే వీటిల్లో- సన్నని గొట్టాలూ, చిన్న చిన్న గంటలూ, బోలెడన్ని ఆకారాలూ కనిపిస్తాయి. అయితే సరికొత్తగా ఎల్‌ఈడీ లైట్‌ కలర్‌ ఛేంజింగ్‌ విండ్‌ చైమ్స్‌ కూడా వచ్చాయి. సీతాకోకచిలుకలూ, పిట్టలూ, పువ్వులూ, ఆకులూ... ఇలా రకరకాల అందమైన ఆకారాల్లో కనిపించే ఇవి- పగటి పూట మామూలుగా తెల్లగా కనిపిస్తాయి. కానీ చీకట్లో రంగురంగుల్లోనూ మెరుస్తూ చక్కటి సంగీతాన్నీ వినిపిస్తాయి. చిన్న సోలార్‌ ప్యానెళ్లతో ఉండే ఈ విండ్‌ చైమ్స్‌ పగటి పూట సౌరశక్తితో రీఛార్జ్‌ అయి రాత్రిపూట రంగుల బల్బుల్లా మారిపోతాయన్న మాట. వినసొంపైన శబ్దాలతోపాటూ కనువిందైన కాంతులిచ్చే ఈ గాలి గంటలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..