కూర్చుంటున్నారా?

కూర్చోవడంతో పోలిస్తే ఏ చిన్న పని చేసినా మేలే. కనీసం కూర్చునే సమయాన్ని తగ్గించుకుని మరికాసేపు నిద్రపోయినా గుండె ఆరోగ్యానికి మంచిది అంటున్నారు లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన నిపుణులు.

Published : 25 Nov 2023 23:43 IST

కూర్చోవడంతో పోలిస్తే ఏ చిన్న పని చేసినా మేలే. కనీసం కూర్చునే సమయాన్ని తగ్గించుకుని మరికాసేపు నిద్రపోయినా గుండె ఆరోగ్యానికి మంచిది అంటున్నారు లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన నిపుణులు. కూర్చునే సమయంలో కొన్ని నిమిషాలు లేచి వ్యాయామం చేసినా, నాలుగు అడుగులు వేసినా చాలు. లేదంటే కాసేపు పడుకున్నా మేలేనట. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు పదిహేను వేలమందికి- పరికరాన్ని కట్టి వాళ్ల కదలికల్ని అధ్యయనం చేశారట. అందులో ఎక్కువ సమయం కదులుతూ ఉన్నవాళ్లలో గుండె ఆరోగ్యంగా ఉందట. అలాగే ఎక్కువ సమయం కూర్చునేవాళ్లను ఎంపికచేసి వాళ్లలో కొందరితో ఐదు నిమిషాలపాటు వ్యాయామం చేయించగా మెరుగైన ఫలితం కనిపించింది. తరవాత 54 ఏళ్ల వయసున్న మహిళల్ని ఎంపికచేసి వాళ్లు కూర్చునే సమయంలో ఓ అరగంటసేపు నడిచేలా చేశారట. దీనివల్ల నడుం చుట్టుకొలతతోపాటు బాడీ మాస్‌ ఇండెక్స్‌ తగ్గిందట. మరికొందరిని కూర్చునే సమయం అరగంట తగ్గించి దానికి బదులు అరగంట ఎక్కువ సేపు పడుకునేలా చేసినప్పుడు కూడా బరువు తగ్గడాన్ని గమనించారు. మొత్తమ్మీద కూర్చునే సమయంలో కనీసం ఐదు నిమిషాలయినా పరుగు, బ్రిస్క్‌ వాక్‌, మెట్లు ఎక్కడం... వంటివి చేస్తే గుండె వేగం పెరగడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..