వ్యాయామం ఎప్పుడు చేయాలంటే...

రోజూ నిర్దిష్ట వేళల్లో వ్యాయామం చేయడం వల్ల ఎముకలూ కీళ్లూ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు మాంచెస్టర్‌ యూనివర్సిటీ నిపుణులు. ఆహారం, నిద్ర... వంటి విషయాల్లోనే కాదు, వ్యాయామం చేయడంలోనూ జీవగడియారాన్ని అనుసరించడంవల్ల లాభాలెన్నో ఉంటాయని తొలిసారిగా గుర్తించింది

Updated : 25 Dec 2023 16:31 IST

రోజూ నిర్దిష్ట వేళల్లో వ్యాయామం చేయడం వల్ల ఎముకలూ కీళ్లూ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు మాంచెస్టర్‌ యూనివర్సిటీ నిపుణులు. ఆహారం, నిద్ర... వంటి విషయాల్లోనే కాదు, వ్యాయామం చేయడంలోనూ జీవగడియారాన్ని అనుసరించడంవల్ల లాభాలెన్నో ఉంటాయని తొలిసారిగా గుర్తించింది శాస్త్ర ప్రపంచం. అలా చేయడంవల్ల వయసుతోపాటు వచ్చే ఎముకల- కీళ్ల- కండరాల క్షీణత తగ్గడంతోపాటు ఆర్థ్రయిటిస్‌... వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయనీ చెబుతున్నారు. నిజానికి మన శరీరంలో ఒక్కో వ్యవస్థకీ ఒక్కో గడియారం ఉంటుంది. ఇవన్నీ కేంద్ర జీవ గడియారంతో అనుసంధానమై పనిచేస్తాయనీ, బయటి వాతావరణానికి స్పందిస్తున్నాయనీ తెలుసుకున్నారు. ఉదాహరణకు ఉదయాన్నే వ్యాయామాలు చేయడం అన్న విషయాన్ని మెదడు గుర్తించి ఆ విషయమై ఎముక కణజాలానికి సమాచారాన్ని పంపించి, వాటిని మేల్కొలుపుతుంది. ఆ సమయాన్ని తరచూ మార్చుకుంటూ వెళితే మెదడుకీ ఆయా కణజాలాలకీ మధ్య సమన్వయం లోపించి వ్యవస్థలో ఓ గందరగోళం నెలకొంటుంది. ఆ ప్రభావం ఆరోగ్యం మీదా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులూ అథ్లెట్లూ నిర్దిష్ట వేళల్లో వ్యాయామం చేయడం ఎంతో మంచిదనీ దీనివల్ల ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుందనీ ఆర్థ్రయిటిస్‌ సమస్యలు తగ్గుతాయనీ చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..