ప్రకృతి అందాలతో ఏకాగ్రత

ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందనీ, ఆరోగ్యానికి మేలనీ చెబుతుంటారు. ఆ రెండే కాదు- మేధోశక్తికి ఆధారభూతమైన ఏకాగ్రతా పెరుగుతుందంటున్నారు ఇప్పుడు పరిశోధకులు.

Published : 24 Feb 2024 23:46 IST

ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందనీ, ఆరోగ్యానికి మేలనీ చెబుతుంటారు. ఆ రెండే కాదు- మేధోశక్తికి ఆధారభూతమైన ఏకాగ్రతా పెరుగుతుందంటున్నారు ఇప్పుడు పరిశోధకులు. అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీనిపైన సరికొత్త పరిశోధనొకటి చేశారు. ఓ వందమంది విద్యార్థులకి మెదడు పనితీరుని లైవ్‌గా పరీక్షించే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ(ఈఈజీ) టోపీలని అందించారు. వాళ్ళని రెండు జట్లుగా విభజించి ఓ జట్టుని ప్రకృతి అందాల నడుమ నడవమన్నారు. మరో జట్టుని- నగర రోడ్ల మధ్య నడవాలని సూచించారు. విద్యార్థులలా వేగంగా నడుస్తుండగా పరిశోధకులు- వాళ్ళ మెదడులో జరుగుతున్న మార్పుల్ని ప్రత్యక్షంగా విశ్లేషించారు! నగర రోడ్లపైన నడిచేవారికన్నా- ప్రకృతిమధ్య నడచిన వారిలో ఏకాగ్రతకి కారణమయ్యే ‘ఫ్రంటల్‌ కార్టెక్స్‌’ వందరెట్లు చురుగ్గా పనిచేస్తోందని తేల్చారు. కాబట్టి- పరీక్షలకి సిద్ధమయ్యేవారు రోజూ ఏదోరకంగా ప్రకృతితో మమేకమైతే మంచిదని వారు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..