గుండెపోటును ముందే పసిగట్టొచ్చు...

‘పొగతాగడం మానేయండి... గుండెపోటు రాదు’ అంటే చాలామంది పెడచెవిన పెట్టేస్తారు. ‘ఆరునెలల్లో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదముంది. రోజూ వ్యాయామం చేయండి, మందులు వాడండి.

Updated : 25 Feb 2024 09:54 IST

‘పొగతాగడం మానేయండి... గుండెపోటు రాదు’ అంటే చాలామంది పెడచెవిన పెట్టేస్తారు. ‘ఆరునెలల్లో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదముంది. రోజూ వ్యాయామం చేయండి, మందులు వాడండి. సిగరెట్టూ మద్యంలాంటివాటిని దూరంగా పెట్టండి’ అంటే వింటారు కదా! అందుకోసమే ఓ అధునాతన రక్తపరీక్షని కనిపెట్టారు స్వీడన్‌ ఉప్సలా యూనివర్సిటీకి చెందిన జొహన్‌ సన్‌స్ట్రామ్‌ అనే ప్రొఫెసర్‌. గుండెపోటుకి కొద్దికాలానికి ముందే శరీరం కొన్ని అణువుల్ని(మాలిక్యూల్స్‌) విడుదలచేస్తుందట. అలాంటి 90 అణువుల్ని- ప్రపంచంలోని 1.69 లక్షల మంది రక్త నమూనాలని విశ్లేషించి మరీ గుర్తించారాయన. రక్తంలో ఇవి ఎంత ఎక్కువగా కనిపిస్తే- గుండెపోటు అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని సన్‌స్ట్రామ్‌ చెబుతున్నారు. ఈ అణువుల్ని అత్యంత వేగంగా విశ్లేషించి చెప్పడానికి ప్రత్యేక ఆన్‌లైన్‌ టూల్‌నీ సిద్ధంచేశారు. రక్తపరీక్షతోపాటూ- జీవిత భాగస్వామి దూరం కావడం, క్యాన్సర్‌లాంటి తీవ్ర రోగాలున్నాయని బయటపడడం వంటి కారణాలూ ఉంటే వాళ్ళని ‘హైరిస్కు’ రోగులుగా గుర్తించాలని చెబుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు