స్నేహాలతోనే... పని సామర్థ్యం!

టీ పాయింట్‌ దగ్గర ముచ్చట్లు, క్యాంటీన్‌లో కాసేపు బాతాఖానీ... ఇవన్నీ పనికి చేటని అనుకుంటాం కానీ నిజానికి ఆ స్నేహాలే సామర్థ్యాన్ని పెంచుతాయట.

Published : 24 Feb 2024 23:51 IST

టీ పాయింట్‌ దగ్గర ముచ్చట్లు, క్యాంటీన్‌లో కాసేపు బాతాఖానీ... ఇవన్నీ పనికి చేటని అనుకుంటాం కానీ నిజానికి ఆ స్నేహాలే సామర్థ్యాన్ని పెంచుతాయట. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లూ, హైబ్రిడ్‌ పనివేళలూ పెరిగి ఇలాంటి ‘భేటీల్ని’ కోల్పోయి నందువల్లే- యువతలో ఒంటరితనం పెరుగుతోందట. ఈ ఒంటరితనం తరచూ అనారోగ్యాలూ, మానసిక చికాకులకి దారితీసి దాని ప్రభావం పనిసామర్థ్యంపైనా పడుతోందంటున్నారు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ దన్‌బార్‌. కుటుంబసభ్యులూ, బంధువులే కాదు- ఆఫీస్‌ స్నేహాలూ మన వికాసానికి ముఖ్యమంటారాయన. ఆఫీసులోని ఉద్యోగుల మధ్య ఉన్న స్నేహాలూ, పని సామర్థ్యాలపైన గత 30 ఏళ్ళుగా తన బృందంతో కలిసి పలు పరిశోధనలు చేస్తున్నారాయన. ఆ అధ్యయనాలని క్రోడీకరించి ‘ది సోషల్‌ బ్రెయిన్‌- ది సైకాలజీ ఆఫ్‌ సక్సెస్‌ గ్రూప్స్‌’ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పుణ్యమాని అందరూ జూమ్‌మీటింగ్‌లకి పరిమితం కావడం వల్ల ఉద్యోగుల మధ్య ఏ అనుబంధమూ ఉండట్లేదంటున్నారు. అది సంస్థపట్ల ‘నా’ అనే భావనని దెబ్బతీస్తోందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..