మంచి బ్యాక్టీరియాని పెంచే పసుపు!

పసుపు గురించి కొత్తగా చెప్పేదేముంది... ఎన్నో తరాలుగా సౌందర్యసాధనంగానో, వంట సామగ్రిగానో వాడుతూ వస్తున్నాం మనం. ఆధునిక సైన్స్‌ కూడా అది యాంటిబయోటిక్‌గా ఉపయోగపడుతుందని చెబుతోంది.

Published : 23 Mar 2024 23:59 IST

సుపు గురించి కొత్తగా చెప్పేదేముంది... ఎన్నో తరాలుగా సౌందర్యసాధనంగానో, వంట సామగ్రిగానో వాడుతూ వస్తున్నాం మనం. ఆధునిక సైన్స్‌ కూడా అది యాంటిబయోటిక్‌గా ఉపయోగపడుతుందని చెబుతోంది. కాకపోతే- నేటి ఆధునిక వైద్యం సృష్టిస్తున్న యాంటీబయోటిక్‌లు చెడు బ్యాక్టీరియాతోపాటూ మంచివాటినీ చంపేస్తుంటాయి. మరి పసుపు కూడా యాంటిబయోటిక్‌ కదా! ఇది కూడా మంచి బ్యాక్టీరియాని చంపేస్తుందా అంటే... కాదంటోంది తాజా పరిశోధన ఒకటి. బ్రెజిల్‌లోని వెస్టర్న్‌ సవ్‌ పాలో, సవ్‌ పాలో స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. పసుపు ‘ల్యాక్టో బేసిలస్‌’ వంటి మనకి మంచిచేసే బ్యాక్టీరియాని వదిలేయడమే కాదు- వాటి సంఖ్యనీ పెంచుతోందని వీళ్ళు నిరూపించారు. కానీ- ఏది మంచి ఏది చెడు బ్యాక్టీరియా అన్న ఈ విచక్షణ దాన్ని ఆహారంలోనో, మాత్రల రూపంలోనో తీసుకుంటే రాదట. మరి? పసుపులో ఉండే కర్కుమిన్‌ అన్న పిగ్మెంట్‌ని అతిసూక్ష్మ ‘నానో’ అణువులుగా మారిస్తే వస్తుందట. అలా వాటిని మార్చి సూక్ష్మ అణువులుగా పేగుల్లోని మంచి చేసే బ్యాక్టీరియాని 20 శాతం పెంచిన పరిశోధకులు- అల్సర్‌, క్రాన్స్‌ సిండ్రోమ్‌ వంటి పేగువాపు(ఇన్‌ఫ్లమేషన్‌) సమస్యలకి పసుపును ప్రత్యామ్నాయ ఔషధంగా తీసుకురాబోతున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు