సముద్రపు నాచుతో నేలపైన నాట్లు!

‘మనకి ఆక్సిజన్‌ ఎక్కడి నుంచి వస్తుంది?’ ఈ ప్రశ్న వేస్తే ఎవరైనా సరే ‘చెట్ల నుంచి’ అని చటుక్కున చెప్పేస్తారు. నిజానికి, చెట్లకన్నా ఎక్కువగా మనకి ప్రాణవాయువుని అందించేది సముద్రపు నాచు(ఆల్గే). ప్రపంచంలో ఉన్న 50 శాతం ఆక్సిజన్‌కి అదే మూలకారణం.

Published : 24 Mar 2024 00:37 IST

‘మనకి ఆక్సిజన్‌ ఎక్కడి నుంచి వస్తుంది?’ ఈ ప్రశ్న వేస్తే ఎవరైనా సరే ‘చెట్ల నుంచి’ అని చటుక్కున చెప్పేస్తారు. నిజానికి, చెట్లకన్నా ఎక్కువగా మనకి ప్రాణవాయువుని అందించేది సముద్రపు నాచు(ఆల్గే). ప్రపంచంలో ఉన్న 50 శాతం ఆక్సిజన్‌కి అదే మూలకారణం. చెట్లలో ఆక్సిజన్‌ ఎలా వస్తుందో మనం సైన్స్‌ పాఠాల్లో చదువుకుని ఉంటాం. సూర్యరశ్మిని చెట్లు ‘పత్రహరితం’(క్లోరోఫిల్‌)గా మార్చుకుని బతుకుతాయని వినీ ఉంటాం. సముద్రపు నాచు కూడా ఇలాగే చేస్తుంది. కానీ-నేలతో పోల్చుకుంటే సముద్రగర్భంలోకి వెళ్ళే సూర్యకిరణాల శాతం తక్కువ కదా! ఆ తక్కువ కిరణాలతోనే నాచు పత్రహరితాన్ని సమర్థంగా తయారు చేసుకుంటుంది. అందువల్లే దాని పత్రహరితం ఎక్కువ శక్తిమంతంగా ఉంటుంది! సముద్రపు నాచుకి ఇదెలా సాధ్యమవుతోంది అన్నదానిపైన శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూ వచ్చారు. తాజాగా- అందుకు కారణమైన జన్యువుని పసిగట్టారు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఇప్పుడు ఆ జన్యువుని నేలపైనున్న చెట్లలో చొప్పించి పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం పొగాకు చెట్లపైన ప్రయోగాలు మొదలుపెట్టారు. ఇవి విజయం సాధిస్తే- ఓ ఎకరంతో వచ్చే దిగుబడిని సెంటు స్థలంలో- అతితక్కువ ఎరువులతోనే సాధించవచ్చట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు