మంచి నిద్రతో వయసు తగ్గొచ్చు!

మనందరికీ తెలిసిన విషయం ఒకటుంది... మన అసలు వయసుకంటే మనకి మనం ఫీలవుతున్న వయసు వేరు అన్నది. దీన్నే ‘సబ్జెక్టివ్‌ ఏజ్‌’ అంటారు. నిత్యం ఉత్సాహంగా ఉండేవాళ్ళు 55 ఏళ్ళలో ఉన్నా 45లో ఉన్నట్టే ఫీలవుతారు- ఆ మాట బయటకు చెప్పకున్నా సరే.

Updated : 07 Apr 2024 06:57 IST

నందరికీ తెలిసిన విషయం ఒకటుంది... మన అసలు వయసుకంటే మనకి మనం ఫీలవుతున్న వయసు వేరు అన్నది. దీన్నే ‘సబ్జెక్టివ్‌ ఏజ్‌’ అంటారు. నిత్యం ఉత్సాహంగా ఉండేవాళ్ళు 55 ఏళ్ళలో ఉన్నా 45లో ఉన్నట్టే ఫీలవుతారు- ఆ మాట బయటకు చెప్పకున్నా సరే. అదే ఎప్పుడూ డీలాగా ఉండేవారు 35 ఏళ్ళలోనూ తమకి తాము 40ల్లో ఉన్నట్టు భావిస్తారు. ‘ఈ తేడా ఎందుకొస్తోంది? ఈ భావనకీ నిద్రకీ ఏదైనా సంబంధం ఉందా?’ అన్న సందేహం వచ్చింది ఇటీవల స్వీడన్‌లోని కెరోలిన్‌స్కా వర్సిటీ పరిశోధకులకి. దానిపైన- 186 మందితో అధ్యయనానికి నడుంబిగించారు. వాళ్ళని రెండువారాలు తొమ్మిదిగంటలపాటు నిద్రపొమ్మన్నారు. అదయ్యాక- ఓ రెండురోజుల పాటు నాలుగుగంటలే నిద్రపోనిచ్చారు. ఆ రెండు సందర్భాల్లోనూ వాళ్ళ ఉత్సాహాన్నీ, చురుకుదనాన్నీ, తద్వారా వాళ్ళ ‘సబ్జెక్టివ్‌ ఏజ్‌’నీ అంచనావేశారు. మొదటి రెండువారాలు కంటి నిండా నిద్రపోయి నప్పుడు- ప్రతిరోజూ తమ వయసు 0.23 ఏళ్ళు(దాదాపు రెండు న్నర నెలలు) తగ్గుతున్నట్టు ఫీలయ్యారట ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు. అదే- నిద్ర తగ్గినప్పుడు వయసు నాలుగు న్నరేళ్ళు పెరిగినట్టు భావించారట. దీన్నిబట్టి నిద్రకీ సబ్జెక్టివ్‌ ఏజ్‌కీ చాలా దగ్గర సంబంధం ఉందని రూఢీ అయ్యిందంటున్నారు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..