రోబోలు మాట్లాడుకుంటే?!

‘ఏం... ఇప్పటిదాకా రోబోలు మాట్లాడుకోలేదా?’ అన్న సందేహం రావొచ్చు మీకు! రెండు రోబోలు సంభాషించడం కాదు కదా... అసలు మనిషి మాటని విని తు.చ.తప్ప కుండా పాటించే రోబో కూడా ఇప్పటిదాకా ప్రపంచంలో లేదు.

Updated : 07 Apr 2024 21:56 IST

‘ఏం... ఇప్పటిదాకా రోబోలు మాట్లాడుకోలేదా?’ అన్న సందేహం రావొచ్చు మీకు! రెండు రోబోలు సంభాషించడం కాదు కదా... అసలు మనిషి మాటని విని తు.చ.తప్ప కుండా పాటించే రోబో కూడా ఇప్పటిదాకా ప్రపంచంలో లేదు. కానీ- ఆ దిశగా తాజాగా ఓ ముందడుగు పడింది. ప్రస్తుతం ఏఐకి సంబంధించి ప్రపంచంలో రెండురకాల పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒకటి- మెషీన్‌ లెర్నింగ్‌ పద్ధతిలో ‘ఏఐ’కి రకరకాల ముందస్తు సమాచారాన్ని అందించి వాటికి శిక్షణ ఇవ్వడం. చాట్‌జీపీటీలాంటి ఏఐ మోడళ్ళ వెనకున్నది ఈ పద్ధతే. రెండో రకం పరిశోధన- ఏఐ కోసం మనిషి మెదడుని పోలిన సాంకేతికతని సృష్టించడం. న్యూరోలింగ్విస్టిక్‌ ప్రాసెసింగ్‌(ఎన్‌ఎల్‌పీ) వంటివాటితో దీనిపైన ప్రయోగాలు చేస్తున్నారు. ఈ రెండో పరిశోధనల్లో భాగంగా- ఓ ఏఐ రోబోకి కేవలం నోటిమాటద్వారా సూచన ఇచ్చి అది పనిచేసేలా తీర్చిదిద్దారు జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అంటే, ఈ రోబో ఓ మనిషిలా పక్కవాళ్ళ మాట వింటోందన్నమాట! ఇదివరకటి రోబోలన్నీ కేవలం తమకు ముందుగా ఇచ్చిన సూచనని మాత్రమే పాటించేవి. ఈ తాజా ‘ఏఐ’ కొత్త సూచనల్ని పాటించడమే కాదు- తనపక్కనున్న మరో రోబోకి ఆ సమాచారాన్నిచ్చి, దానిచేతా పనిచేయిస్తోందట. అంటే, అవి రెండూ మాట్లాడుకుంటున్నాయన్నమాట! అందుకే ‘ఏఐ’కి సంబంధించి ఇదో పెద్ద ముందడుగని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..