మెదడు సైజు పెరుగుతోందట!

ఆల్జీమర్స్‌, డిమెన్షియా- ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్యలివి. నిజానికి- ఒకప్పటికన్నా ఈ సమస్య తగ్గుతోందని చెబుతున్నారు పరిశోధకులు.

Published : 06 Apr 2024 23:10 IST

ల్జీమర్స్‌, డిమెన్షియా- ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్యలివి. నిజానికి- ఒకప్పటికన్నా ఈ సమస్య తగ్గుతోందని చెబుతున్నారు పరిశోధకులు. వాళ్ళు ఈ నిర్ణయానికి ఎలా... ఎందుకు వచ్చారో తెలియాలంటే అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ- డావిస్‌(యూసీ డావిస్‌) శాస్త్రవేత్తలు చేపట్టిన ‘ఫర్మింగ్‌హామ్‌ హార్ట్‌ స్టడీ’ గురించి తెలుసుకోవాలి. 1948 నుంచీ ప్రపంచంలోని గుండె సమస్యలపైన సాగుతున్న సుదీర్ఘ పరిశోధన ఇది. ఈ పరిశోధనలో భాగంగా తీసిన- మనుషుల మెదడుకి సంబంధించిన స్కాన్‌లని ఈ మధ్య శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అందులో ఓ కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే- 1930ల్లో పుట్టిన మానవులకన్నా, 1970ల తర్వాత పుడుతున్న మనుషుల మెదడు సైజు గణనీయంగా పెరుగుతోందట. చక్కటి పోషకాహారం లభించడం, చదువులు పెరగడమే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా పెరగడం వల్ల ఆల్జీమర్స్‌ వంటి వ్యాధులూ తగ్గుతున్నాయంటున్నారు. మెదడు పెద్దగా కావడమంటే- అందులోని న్యూరాన్‌ల సంఖ్య కూడా అధికం కావడమన్నది ఈ శాస్త్రవేత్తల భావన. అదే ఆల్జీమర్స్‌లాంటి వ్యాధుల్ని తగ్గిస్తూ ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు పెరుగుతున్నందువల్ల ఈ సమస్యలు ఎక్కువైనట్టు అనిపిస్తోందికానీ- జనాభాశాతంతో పోలిస్తే ఆల్జీమర్స్‌ సమస్యలు తగ్గుతున్నాయనే అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..