జీన్స్‌ కోసం ‘ఇండికాన్‌’ వస్తోంది!

జీన్స్‌ రకరకాల రంగుల్లో వస్తున్నా... అందరూ ఇష్టపడే వర్ణం మాత్రం ముదురు నీలమే! కాకపోతే, ఈ కృత్రిమ రంగు తీవ్ర పర్యావరణ సమస్యలకి దారి తీస్తోంది.

Published : 06 Apr 2024 23:12 IST

జీన్స్‌ రకరకాల రంగుల్లో వస్తున్నా... అందరూ ఇష్టపడే వర్ణం మాత్రం ముదురు నీలమే! కాకపోతే, ఈ కృత్రిమ రంగు తీవ్ర పర్యావరణ సమస్యలకి దారి తీస్తోంది. దీన్ని జీన్స్‌కి ‘డై’గా వాడుతున్నప్పుడు- అది నీటిలో సులువుగా కరగడానికి సోడియం డైథియోనైట్‌ అనే రసాయనాన్నీ కలపాలి. ఇవి రెండూ కలిసి నీటివనరుల్ని విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగానే ఇప్పుడు ‘ఇండికాన్‌’ని తెరపైకి తెస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇండికా అన్నది ‘ఇండిగో ఫెరా’ అనే నీలి మొక్క నుంచి వచ్చే సహజసిద్ధ రసాయనం. ఒకప్పటి భారతీయ నేతపనివాళ్ళు దీన్నే ఉపయోగించారు. పాశ్చాత్యులు దానికి రసాయనాలు కలిపి ‘ఇండిగో’గా మార్చారు. కాలుష్యం నేపథ్యంలో అలనాటి ఇండికాని మళ్ళీ ఉపయోగంలోకి తేవాలనుకుంటున్నారు డెన్మార్క్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మొక్కల నుంచి వెలికి తీసి దాని రసాయనాన్ని నీళ్ళలో సులువుగా కరిగేలా మార్చగలిగారు. దాన్ని భారీ ఎత్తున తయారుచేసే దిశగానూ పరిశోధనలు చేస్తున్నారు. అంటే, అతిత్వరలోనే ఇండికాన్‌తో కూడిన సహజసిద్ధ రంగులున్న జీన్స్‌నీ మనం వాడొచ్చన్నమాట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..