ప్రాణ సందేశం

బైకు నడిపేటప్పుడు హెల్మెట్‌, కారు డ్రైవ్‌ చేసేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం చాలామందికి అలవాటు ఉండదు

Published : 02 Apr 2023 00:56 IST

ప్రాణ సందేశం

బైకు నడిపేటప్పుడు హెల్మెట్‌, కారు డ్రైవ్‌ చేసేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం చాలామందికి అలవాటు ఉండదు. కానీ బిహార్‌కి చెందిన రాఘవేంద్ర మాత్రం కారు నడిపేటప్పుడు సీటుబెల్టుతోపాటు హెల్మెట్‌ కూడా ధరిస్తాడు. అతడిని చూస్తే అంత అతి జాగ్రత్త ఏంటో అనిపిస్తుంది- కానీ రోడ్డు ప్రమాదంలో హెల్మెట్‌ పెట్టుకోక ప్రాణాలు కోల్పోయిన స్నేహితుడే అందుకు కారణం. అతనిలా ఎవరూ చనిపోకూడదని హెల్మెట్‌ గురించి ఏడేళ్లుగా అవగాహన కల్పిస్తున్నాడు. దేశవ్యాప్తంగా పలు హైవేలపై ప్రయాణిస్తూ ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్లను ఉచితంగా పంచుతున్నాడు. అలా ఇప్పటి వరకూ 56 వేలకుపైగా హెల్మెట్లు పంచిన రాఘవేంద్ర- ఇల్లు అమ్మి, భార్య నగలు తాకట్టు పెట్టి వచ్చిన రెండు కోట్ల రూపాయల్ని వాటికోసమే ఖర్చు పెట్టాడు. అందుకే అందరూ రాఘవేంద్రని ‘హెల్మెట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు