విందు ఖరీదు లక్ష రూపాయలు!

ఎంత పెద్ద స్టార్‌ హోటలైనా సరే ఓ వ్యక్తి భోజనం చేయడానికి- ఎక్కువలో ఎక్కువగా 10 వేల రూపాయలు కావొచ్చు.

Published : 04 Feb 2024 02:12 IST

ఎంత పెద్ద స్టార్‌ హోటలైనా సరే ఓ వ్యక్తి భోజనం చేయడానికి- ఎక్కువలో ఎక్కువగా 10 వేల రూపాయలు కావొచ్చు. కానీ అక్కడేమో మనిషికి లక్షరూపాయలని ప్రకటించారు. అలాగని అది స్టార్‌హోటల్‌ని తలదన్నే ఇంద్రభవనమేం కాదు. అదో మామిడితోట... పైగా ఆ విందు ఏర్పాటుచేసిందేమో ఆరుబయట. అయినా సరే- టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. 105 మంది హాజరైపోయారు. వాళ్ళని బ్యాండుమేళంతో తీసుకెళ్ళి పొడవైన డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చోబెట్టారు. దాదాపు మూడుగంటలపాటు సాగిందా భోజన కార్యక్రమం. ‘అంతసేపు తిన్నారా..?’ అనుకుంటున్నారేమో! మధ్యమధ్య కాస్త విరామం ఇచ్చి- వాళ్ళు తింటున్న, తినబోతున్న భోజనం స్పెషాలిటీ ఏమిటో వివరించారు మనదేశంలోని 20 మంది ప్రసిద్ధ షెఫ్‌లు! మొత్తానికి భోజనం చేయడాన్ని కూడా ఓ ఉత్సవంలా మార్చారక్కడ! ఎక్కడ అంటారా... చెన్నైలోని ‘హనురెడ్డి మ్యాంగోఫార్మ్స్‌’లో జరిగిందీ కార్యక్రమం. ఇందుకోసం 8000 చదరపుటడుగులతో ప్రత్యేక కిచెన్‌ని ఏర్పాటుచేయడం మరో విశేషం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..