తల్లికోసం ‘పొద్దుతిరుగుడు’ పంట!

ఆమె పేరు భవాని. 80 ఏళ్ళు. ఆల్జీమర్స్‌ సమస్యతో బాధపడుతోంది. జీవితమంతా వ్యవసాయం చేసి ఇప్పుడు పిల్లల పంచనచేరిన ఆమె- కొడుకులకి తన మనసులోని ఓ తీరని కోరిక గురించి చెప్పింది.

Published : 18 Feb 2024 00:07 IST

మె పేరు భవాని. 80 ఏళ్ళు. ఆల్జీమర్స్‌ సమస్యతో బాధపడుతోంది. జీవితమంతా వ్యవసాయం చేసి ఇప్పుడు పిల్లల పంచనచేరిన ఆమె- కొడుకులకి తన మనసులోని ఓ తీరని కోరిక గురించి చెప్పింది. అదేమిటంటే- ఒక్కసారైనా పొద్దుతిరుగుడు పంట చూడాలని. ‘ఓస్‌... ఇంతేనా అనిపిస్తుంది’ కానీ కేరళలో వాళ్ళుంటున్న కొచ్చి ప్రాంతంలో ఆ పంట చాలా అరుదు. అక్కడి మట్టిలో అవి ఎదగవు. మరి ఆమెకి ఆ పంటని చూపించాలంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలక్కాడుకి వెళ్ళాలి. తమ తల్లిని ఆ వయసులో అంత దూరం తీసుకెళ్ళడం అయ్యే పని కాదు. అయినాసరే తల్లి కోరిక తీర్చాలనుకున్నారు ఆమె కొడుకులు- విజయన్‌, గిరి, శశి. తమ బిల్డింగ్‌ పక్కనున్న 50 సెంట్ల భూమిని సాగు క్షేత్రంగా మార్చారు. పొద్దుతిరుగుడు మొక్కల్ని నాటారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ అతి జాగ్రత్తగా పెంచారు. చూస్తుండగానే కనులపండువగా విప్పారాయి పూలు! వాటిని చూసి భవాని ఆనందం అంతాఇంతాకాదు. ఆకాశహర్మ్యాలతో నిండిన ఈ ప్రాంతంలో పసుపు పచ్చగా విచ్చుకున్న పొద్దుతిరుగుడు పూల మధ్య సెల్ఫీలు దిగడానికి యువత క్యూ కడుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..