ఈ లక్డీకాపుల్‌ని... ఇద్దరే కట్టారు!

లక్డీకాపుల్‌... హైదరాబాద్‌ నడిబొడ్డునున్న ప్రముఖ ప్రాంతం పేరు. కొయ్యతో కట్టిన వంతెన అని దానర్థం! ఆ వంతెన ఇప్పుడు పేరుగానే మిగిలినా- ఒడిశాలో కొత్తగా అలాంటి వంతెన ఒకటి నిర్మించారు ఇద్దరు మిత్రులు.

Published : 18 Feb 2024 00:12 IST

క్డీకాపుల్‌... హైదరాబాద్‌ నడిబొడ్డునున్న ప్రముఖ ప్రాంతం పేరు. కొయ్యతో కట్టిన వంతెన అని దానర్థం! ఆ వంతెన ఇప్పుడు పేరుగానే మిగిలినా- ఒడిశాలో కొత్తగా అలాంటి వంతెన ఒకటి నిర్మించారు ఇద్దరు మిత్రులు. అక్కడి కోరాపుట్‌ - నబరంగ్‌పూర్‌ జిల్లాలను వేరుచేస్తూ ఇంద్రావతి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదికి అటూఇటూ కోరాపుట్‌ జిల్లాకి చెందిన డెంగ్‌పదార్‌,   నబరంగ్‌పూర్‌ జిల్లాలోని సింధిగాఁవ్‌ గ్రామాలుంటాయి. వాటి మధ్య దూరం కేవలం 400 మీటర్లే కానీ మధ్యలో నదిపైన వంతెన లేకపోవడం వల్ల వాహనాలు 20 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రభుత్వం తమ మొరని పెడచెవిన పెట్టడంతో ఆ నదిపైన తామే సొంతంగా ఓ వంతెనని నిర్మించారు సింధ్‌గాఁవ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు- కమల్‌ లోచన్‌ గతలి, భగబాన్‌ ముదులి. ఇద్దరూ కూలీనాలీ చేసుకుంటూ 50వ పడిలోకి అడుగుపెట్టినవారు. అయితేనేం, ప్రజల బాధని తీర్చాలన్న లక్ష్యంతో అప్పటిదాకా తాము కూడబెట్టిన 50 వేల రూపాయల్ని ఖర్చుపెట్టి కొయ్యలతో దీన్ని నిర్మించారు. 150 మీటర్లున్న ఈ వంతెనపైన రోజూ వందలాది వాహనాలు వెళ్ళొస్తున్నాయిప్పుడు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..