రారండోయ్‌... కుండలు చేద్దాం!

పిల్లలకే కాదు... ఇప్పుడు పెద్దలకీ కుమ్మరి పనులు నేర్పే సంస్థలు నగరాల్లో కనిపిస్తున్నాయి. మెత్తని తడిమట్టిని అలా నేరుగా తాకుతూ- ఆకృతులుగా మలచడం రోజువారీ ఒత్తిడిని పోగొడుతుందని చెబుతుంటారు.

Published : 24 Feb 2024 23:58 IST

పిల్లలకే కాదు... ఇప్పుడు పెద్దలకీ కుమ్మరి పనులు నేర్పే సంస్థలు నగరాల్లో కనిపిస్తున్నాయి. మెత్తని తడిమట్టిని అలా నేరుగా తాకుతూ- ఆకృతులుగా మలచడం రోజువారీ ఒత్తిడిని పోగొడుతుందని చెబుతుంటారు. దీనికే కాస్త ‘రొమాంటిక్‌ టచ్‌’ ఇస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో! ప్రేమికులూ, భార్యాభర్తల కోసం ప్రత్యేక శిక్షణని డిజైన్‌ చేశారు. దీన్ని ‘క్లే డేట్‌’ అంటున్నారు. ఇందులో భాగంగా- ముందు ఇద్దరికీ కలిపి కుండలు చేయడాన్ని నేర్పిస్తారు ఇక్కడ. ఆ తర్వాత ఆ జంట తమదైన సమన్వయంతో సొంతంగా కుండలు చేయాలి. ఇద్దరూ చేయిచేయి కలిపి తడిమట్టిని ముద్దగా చేయడం, చేసినదాన్ని ఆకృతులుగా మలిచేందుకు చేసే ప్రయత్నంలో- దంపతులుగా నేర్చుకునే కమ్యూనికేషన్‌ పాఠాలు ఎన్నో ఉన్నాయంటున్నారు నిర్వాహకులు. జంటలో ఒకరు కళ్ళకి గంతలు కట్టుకుంటే- మరొకరు వాళ్ళకి సూచనలు అందిస్తూ కుండలు తయారుచేయించే పోటీ కూడా పెడుతున్నారు! ‘బ్లైండ్‌ క్లే డేట్‌’ అంటున్నారు దీన్ని. బెంగళూరులో సుమారు మూణ్ణాలుగు పాటరీ స్టూడియోలు ఈ క్లే డేట్స్‌ని నిర్వహిస్తున్నాయి. ఈ జంటలు తయారు చేసిన కుండలకి కాస్త మెరుగులద్ది రెండువారాల తర్వాత వాళ్ళ ఇంటికే పంపిస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు