ఆయన ‘ఉత్తమ శ్రోత’!

ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా రేడియో వినగా చూశారా? ఎఫ్‌ఎం తప్ప మామూలు రేడియో వినేవారు కన్పించడంలేదు. ఎంత పాతతరం వాళ్ళయినా సరే- ఇప్పుడు ఆసక్తిగా మొబైల్‌లో లీనమైపోతున్నారు.

Updated : 25 Feb 2024 04:07 IST

ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా రేడియో వినగా చూశారా? ఎఫ్‌ఎం తప్ప మామూలు రేడియో వినేవారు కన్పించడంలేదు. ఎంత పాతతరం వాళ్ళయినా సరే- ఇప్పుడు ఆసక్తిగా మొబైల్‌లో లీనమైపోతున్నారు. అలాంటిది ఉదయం 5.30 నుంచి రాత్రి తొమ్మిదిన్నరదాకా కేవలం రేడియోతోనే ఓ వ్యక్తి గడపడం అంటే విడ్డూరమే కదా! కేరళ కొచ్చికి చెందిన సీకే అలెగ్జాండర్‌ అందుకే వార్తలకెక్కారు. 83 ఏళ్ళ అలెగ్జాండర్‌ కేరళలో ఆకాశవాణి కేంద్రం మొదలైన తొలిరోజు నుంచే- అంటే 60 ఏళ్ళ నుంచీ ఒక్కరోజూ వదలకుండా అన్ని కార్యక్రమాలూ వింటున్నారట. సుమారు 40 ఏళ్ళ నుంచీ ఆ కార్యక్రమాలపైన లేఖలు రాస్తున్నారట. అలా విద్య, వ్యవసాయాలకి సంబంధించిన కార్యక్రమాలపైన అలెగ్జాండర్‌ విశ్లేషణాత్మక లేఖల్ని మెచ్చి- ఆయన చేతే పలు కార్యక్రమాలనీ చేయించిందట ఆకాశవాణి. 1980 నుంచి ఇప్పటిదాకా కేరళ ఆకాశవాణి ‘శ్రవణశ్రీ’(ఉత్తమ శ్రోత) అవార్డుని 20 సార్లు అందుకున్నారట. పలుమార్లు కేంద్రమంత్రులూ ఈ అవార్డు అందించారట! ఓ మారుమూల గ్రామంలో పుట్టి ప్రపంచమంటే తెలియని తనకు ఆకాశవాణే దారిచూపిందనీ, అందుకే కడదాకా దాన్ని వదలననీ చెబుతున్నారు అలెగ్జాండర్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..