పార్కుల్లో పుస్తకాలు

మన నగరాల్లోని పార్కుల్లో ఏమేం ఉంటాయి? కలబంద జ్యూస్‌ నుంచి చిరుధాన్యాల జావదాకా ఆరోగ్యానికి మంచిదనుకున్న ప్రతిదీ ఉంటోంది. కానీ అవన్నీ శారీరక ఆరోగ్యానికి!

Published : 25 Feb 2024 00:06 IST

మన నగరాల్లోని పార్కుల్లో ఏమేం ఉంటాయి? కలబంద జ్యూస్‌ నుంచి చిరుధాన్యాల జావదాకా ఆరోగ్యానికి మంచిదనుకున్న ప్రతిదీ ఉంటోంది. కానీ అవన్నీ శారీరక ఆరోగ్యానికి! మరి మానసిక ఆరోగ్యానికి... సాహిత్యాన్ని మించింది ఏముంటుంది? అందుకే చెన్నై నగరంలోని ప్రతి పార్కులోనూ ఓ ‘బుక్‌ జోన్‌’ని ఏర్పాటుచేస్తోంది అక్కడి నగరపాలక సంస్థ. పార్కులకి వచ్చినవాళ్ళకి ఉచితంగా పుస్తకాలిచ్చి చదవమంటోంది. చిన్నారుల్నీ, యువతనీ లక్ష్యంగా చేసుకుని ఇటీవలే వీటిని ఏర్పాటుచేసింది. వార్తాపత్రికలూ, పోటీపరీక్షల పుస్తకాల జోలికెళ్ళకుండా- పూర్తిగా ఇంగ్లిషు, తమిళ ఆధునిక సాహిత్యాన్నే పరిచయం చేస్తోంది. ‘పోటీపరీక్షలకి సంబంధించిన మెటీరియల్‌ ఎక్కడైనా దొరుకుతోంది. నేటి యువతకి కరవవుతున్నది సాహిత్య పరిచయమే. సంపూర్ణ వికాసానికి అదే తోడ్పడుతుంది’ అంటున్నారు ఈ బుక్‌ జోన్‌లని ఏర్పాటుచేస్తున్న కార్పొరేషన్‌ అధికారులు. అది కూడా సంపన్నులున్న ప్రాంతాల్లో కాకుండా మురికివాడల దగ్గరే ఈ పార్క్‌ బుక్‌ జోన్‌లని ఏర్పాటుచేయడం విశేషం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..