ఎద్దులపోటీ చూడాల్సిందే...

మనదేశంలో కొందరు క్రికెట్‌ వీరాభిమానులుంటారు. భారత్‌లో ఏ మూల ఏ మ్యాచ్‌ జరిగినా ఆ స్టేడియానికి వెళ్ళిపోయి ఆటని ఆస్వాదిస్తూ వార్తలకెక్కుతారు.

Published : 25 Feb 2024 00:10 IST

మనదేశంలో కొందరు క్రికెట్‌ వీరాభిమానులుంటారు. భారత్‌లో ఏ మూల ఏ మ్యాచ్‌ జరిగినా ఆ స్టేడియానికి వెళ్ళిపోయి ఆటని ఆస్వాదిస్తూ వార్తలకెక్కుతారు. అలాంటి అభిమానం అంతర్జాతీయ ఆటకే ఎందుకుండాలి... స్థానిక క్రీడలకి ఉండకూడదా అనిపిస్తుంది సుందరమ్మ అన్న ఈ పండు ముదుసలిని చూస్తే! తమిళనాడులో ఏటా సంక్రాంతి తర్వాత ఎద్దుని పట్టే ‘జల్లికట్టు’ పోటీలు జరగుతుంటాయని తెలుసుకదా! ఆ పోటీలు అక్కడి మదురై నగరం, దాని చుట్టుపక్కలున్న రెండు మూడు జిల్లాల్లో చోటుచేసుకుంటాయి. ఆరునూరైనా ఏటా ఆ పోటీలన్నింటికీ హాజరైపోతుంది సుందరమ్మ. అదీ ఎక్కణ్ణుంచి అనుకున్నారు... చెన్నై నుంచి. అంటే ఈ వయసులో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఈ పోటీలు చూస్తుందన్నమాట. ఇంతకీ చెన్నైలో ఉపాధి హామీ కూలీపనులు చేస్తుంటుందామె. అయినవాళ్ళెవరూ లేకపోవడంతో- ఏడాదంతా అలా శ్రమించి దాచుకున్న డబ్బుతో ఏటా ఇలా జల్లికట్టు పోటీలకి  హాజరైపోతుంది. అలుపెరగని ఉత్సాహంతో పోటీపడేవాళ్ళని ప్రోత్సహిస్తుంది!

​​​​​​​


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..