ఆడపిల్లల్లా పెంచలేదు!

ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనమవుతున్న రోజులివి. అలాంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏడుగురు తోబుట్టువులు బిహార్‌ పోలీసు శాఖలో కొలువులు సాధించారు.

Published : 03 Mar 2024 00:29 IST

ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనమవుతున్న రోజులివి. అలాంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏడుగురు తోబుట్టువులు బిహార్‌ పోలీసు శాఖలో కొలువులు సాధించారు. ‘ఈ విజయం మాది కాదు నాన్నది’ అనే ఆ అక్కచెల్లెళ్లది బిహార్‌లోని సరన్‌ జిల్లా కేంద్రం. పిండి మిల్లు నడుపుకునే రాజ్‌కుమార్‌ సింగ్‌కు ఏడుగురు ఆడపిల్లలు. చుట్టుపక్కల వాళ్లంతా అతడిని చులకనగా చూడటంతోపాటు కూతుళ్లకి పెళ్లెలా చేస్తావనేవారు. ఆ మాటలకు మనసులో బాధ కలిగినా సరే రాజ్‌కుమార్‌ మాత్రం తన కూతుళ్లని ఆడపిల్లల్లా కాకుండా ఆడపులుల్లా పెంచాడు. ఉండటానికి సరైన ఇల్లు లేకపోయినా అప్పు చేసి మరీ చదివించాడు. తండ్రి కష్టాన్నీ, ఎదుర్కొన్న హేళనల్నీ అర్థం చేసుకున్న ఏడుగురు కూతుళ్లు కష్టపడి పోలీసు ఉద్యోగాలు సాధించారు. ముగ్గురు ఆడపిల్లలు కానిస్టేబుళ్లుగా కొలువు దీరితే, మరో నలుగురు ఎక్సైజ్‌, క్రైమ్‌ బ్రాంచ్‌, సీఆర్‌పీఎఫ్‌, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ల్లో ఉద్యోగాలు సంపాదించి- తండ్రి అప్పుల్ని తీర్చడంతోపాటు ఓ పెద్ద బంగళాను కట్టించి ఇచ్చారు. ఇప్పుడా గ్రామంలో రాజ్‌కుమార్‌ సింగ్‌ ఓ సెలబ్రిటీనే అయ్యాడు మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..