గుర్రం సాగు

దుక్కి దున్నడానికీ బండి కట్టడానికీ- ఎద్దుల్నీ ఆవుల్నీ ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి వెళితే ఓ రైతు గుర్రంతో దుక్కి దున్నుతుంటాడు.

Published : 03 Mar 2024 00:30 IST

దుక్కి దున్నడానికీ బండి కట్టడానికీ- ఎద్దుల్నీ ఆవుల్నీ ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి వెళితే ఓ రైతు గుర్రంతో దుక్కి దున్నుతుంటాడు. దానితో బండి కట్టి పంటను ఇంటికి తీసుకొస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా మన దగ్గర వ్యవసాయానికి గుర్రాలను ఎవరూ వాడరు. రైతు మెరుగు రాములు దాన్నెందుకు ఉపయోగిస్తున్నాడంటే... కొన్నేళ్ల క్రితం సరదాగా పెంచుకుందామని ఓ గుర్రం పిల్లని తక్కువ రేటుకి కొనుగోలు చేశాడు. మరోవైపు చాలా కాలంగా ఒంటెద్దుతో వ్యవసాయం చేస్తూ ఇబ్బంది పడుతున్నాడు. గుర్రం పెరిగి పెద్దయ్యాక మరో ఎద్దుకు బదులు దాంతోనే వ్యవసాయం చేయొచ్చని సాగు చేస్తున్నాడు. ‘చిట్టి’ అనే పేరు పెట్టి ప్రేమగా పెంచుకున్న ఈ గుర్రాన్ని సాగు పనుల్లో పెట్టడానికి రాములు ఎంతో కష్టపడ్డాడట. అలవాటు పడ్డాక ఇప్పుడు ఎంతో చలాకీగా పనులు చేస్తోందట చిట్టి.

 సుమన్‌, న్యూస్‌టుడే, చెన్నారావుపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు