ఓం ఆకారంలో...

ఆలయాలను ప్రత్యేకంగానూ, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలానూ నిర్మిస్తుంటారు. అయితే ఆకృతిలోనూ అడుగడుగునా దైవత్వం ప్రతిబింబించేలా ఓ ఆలయాన్ని ‘ఓం’ ఆకృతిలో తీర్చిదిద్దారు.

Published : 03 Mar 2024 00:33 IST

లయాలను ప్రత్యేకంగానూ, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలానూ నిర్మిస్తుంటారు. అయితే ఆకృతిలోనూ అడుగడుగునా దైవత్వం ప్రతిబింబించేలా ఓ ఆలయాన్ని ‘ఓం’ ఆకృతిలో తీర్చిదిద్దారు. ఓంకారం ప్రతిధ్వనించడంతోపాటు అదే ఆకారంలో సాక్షాత్కరించే ఆ ఆలయాన్ని చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో ఉన్న జోదన్‌ గ్రామానికి వెళ్లాల్సిందే. దాదాపు 300 ఎకరాల్లో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఈ శివాలయాన్ని ‘విశ్వదీప్‌ గురుకుల్‌’ ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వామీ మహేశ్వరానందన్‌ కట్టించారు. వందకుపైనే ఆలయాల సముదాయంతో ప్రకృతి మధ్యలో రూపుదిద్దుకున్న ఓంకార ఆలయంలో జ్యోతిర్లింగాలూ వెయ్యికిపైనే దేవతామూర్తులూ దర్శనమిస్తాయి. ఇరవై ఎనిమిదేళ్లపాటు నిర్మించిన ఆ ఆలయం ఈ మధ్యనే భక్తులకు అందుబాటులోకి వచ్చి మహాశివరాత్రి వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..