తరలించే ఆసుపత్రి

కంటైనర్‌ ఇళ్లూ, స్కూళ్లూ, ఆఫీసులూ మనకు తెలుసు. వీటిని కావల్సిన చోట పెట్టుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి తరలించడం కూడా తేలికే.

Published : 03 Mar 2024 00:35 IST

కంటైనర్‌ ఇళ్లూ, స్కూళ్లూ, ఆఫీసులూ మనకు తెలుసు. వీటిని కావల్సిన చోట పెట్టుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి తరలించడం కూడా తేలికే. అందుకే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద కంటైనర్లతో హాస్పిటళ్లను నిర్మించింది. పెద్ద పెద్ద ప్రమాదాలూ, ప్రకృతి విపత్తులూ, దేశ సరిహద్దుల్లో దాడులూ జరిగినప్పుడు గాయాలపాలైన వారికి తక్షణ చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్యశిబిరాల్లో చిన్నపాటివి తప్ప పెద్ద చికిత్సలు చేయడం కుదరదు. అలాంటి సమయాల్లో కంటైనర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే ప్రమాదాల్లో ఉన్న ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుంది. అందుకోసం విడివిడి కంటైనర్లలో పరీక్షా కేంద్రాలూ, ఐసీయూ, ఫార్మసీ, పడకలూ, ఐసొలేషన్‌ వార్డులాంటివన్నీ అందుబాటులోకి తెచ్చారు. వందమందికి సేవలందించేలా ఈ కంటైనర్‌ హాస్పిటల్‌ని ఐఐటీ దిల్లీ- ఎయిమ్స్‌ బృందం డిజైన్‌ చేశారు. ప్రస్తుతం రెండు ఆసుపత్రులను సిద్ధం చేసి దిల్లీ, చెన్నై నగరాల్లో అందుబాటులో ఉంచి ఎక్కడ అవసరముంటే అక్కడికి క్షణాల్లో వాయు మార్గంలో తరలించేలా ఏర్పాటు చేశారు అధికారులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..