సెల్ఫీ లస్సీ తాగారా!

వేసవి తాపాన్ని తగ్గించే పానీయాల్లో ముందుంటుంది లస్సీ. ఇది అందరి ఇళ్లలో దొరుకుతుంది. అయితే ఈ చలువ పానీయాన్నే ఇప్పుడు విందుల్లో ప్రత్యేకంగా అందిస్తున్నాయి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు.

Published : 10 Mar 2024 00:08 IST

వేసవి తాపాన్ని తగ్గించే పానీయాల్లో ముందుంటుంది లస్సీ. ఇది అందరి ఇళ్లలో దొరుకుతుంది. అయితే ఈ చలువ పానీయాన్నే ఇప్పుడు విందుల్లో ప్రత్యేకంగా అందిస్తున్నాయి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు. చాక్లెట్లూ, పువ్వులూ, కాఫీలూ, కేకులూ ఎలాగైతే ఫొటో ప్రింట్లతో అలరిస్తున్నాయో... ఇప్పుడు లస్సీ కూడా వాటి మాదిరే ‘అలంకరణ’లతో వస్తోంది. అప్పటికప్పుడు సెల్ఫీ తీసుకునో, మన దగ్గరే ఉన్న ఫొటోనోే ఇస్తే దాన్నే లస్సీ గ్లాసుపైన చిత్రంగా ముద్రించి ఇస్తారు. ఎడిబుల్‌ రంగులతో పరుచుకున్న ఆ ఫొటో లస్సీని తాగినా ఏమీ కాదు. లస్సీని దగ్గరికి రానివ్వని చిన్నారులకు దాన్ని ఈ విధంగా అందిస్తే ఎంతో ఎంజాయ్‌ చేస్తూ తాగేస్తారు కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు