టీచర్లకే నేర్పిస్తున్నారు!

బిహార్‌ మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పని చేయడానికి మహిళా టీచర్లు ఇష్టపడలేదు. కొందరేమో సమయానికి స్కూలుకు హాజరు కాకపోవడం, తరచూ సెలవులు పెడుతుండటం గమనించారు విద్యాశాఖ అధికారులు.

Published : 10 Mar 2024 00:11 IST

బిహార్‌ మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పని చేయడానికి మహిళా టీచర్లు ఇష్టపడలేదు. కొందరేమో సమయానికి స్కూలుకు హాజరు కాకపోవడం, తరచూ సెలవులు పెడుతుండటం గమనించారు విద్యాశాఖ అధికారులు. టీచర్లు అక్కడ పని చేయడానికి ఇష్టపడక కాదనీ- రోడ్డు వసతి లేక రవాణా సదుపాయాలకు దూరంగా ఉన్న ఆ గ్రామాలకు చేరుకోలేకపోవడమే అసలు కారణమని తెలుసుకున్నారు. అందుకే బిహార్‌ రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి ఓ ఆలోచన చేసింది. స్కూలు పని వేళల్లోనే రోజుకు ఓ గంట మహిళా టీచర్లకి స్కూటీ నడపడం నేర్పిస్తోంది. కొత్తగా నియామకం అయిన వారికి విధుల్లో చేరక ముందే డ్రైవింగ్‌ నేర్పించి లైసెన్స్‌ కూడా అందిస్తోంది. రాయితీతో స్కూటీలు కొనుక్కోవడానికీ ప్రోత్సహిస్తోంది. మూడు నెలలుగా బిహార్‌ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల డ్రైవింగ్‌ నేర్చుకున్న దాదాపు వంద మంది టీచర్లు స్కూటీలపైన సమయానికి స్కూళ్లకు చేరుకుంటున్నారు. ఎక్కువ సమయం కూడా కేటాయించి గ్రామీణ విద్యార్థులకు అదనపు తరగతులు కూడా  నిర్వహిస్తున్నారు. విద్యార్థులకోసం ప్రభుత్వం చేసిన ఈ ఆలోచన బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..