చెక్కతో ఉపగ్రహం

అంతరిక్షంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునేలా ఉపగ్రహాలను స్టీలు, టైటానియం, అల్యూమినియం, ప్లాస్టిక్‌ తదితరాలతో ప్ర£త్యేకమైన మెకానిజంతో రూపొందిస్తారు.

Published : 10 Mar 2024 00:13 IST

అంతరిక్షంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునేలా ఉపగ్రహాలను స్టీలు, టైటానియం, అల్యూమినియం, ప్లాస్టిక్‌ తదితరాలతో ప్రత్యేకమైన మెకానిజంతో రూపొందిస్తారు. జపాన్‌ మాత్రం అందుకు భిన్నంగా పర్యావరణహితంగా చెక్కతో శాటిలైట్లను తయారు చేసింది. ట్రయల్‌ రన్‌తో విజయం సాధించిన జపాన్‌ ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో ఉపగ్రహాలను రూపొందించి, ప్రయోగించే దేశంగా గుర్తింపునూ సొంతం చేసుకోనుంది. ఉపగ్రహం తయారీలో వాడే లోహాలు ఓజోన్‌పొరను దెబ్బ తీస్తాయనే ఉద్దేశంతో క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేశారు. అందుకోసం చంపక వృక్షాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా పగుళ్లు రాకుండా దృఢంగా ఉంటుందని ఆ చెట్టు కలపను ఎంపిక చేసుకున్న శాస్త్రవేత్తలు... దానిపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ కలపతో తయారుచేసిన శాటిలైట్‌ను త్వరలోనే అంతరిక్షంలోకి పంపి ప్రయోగాలు చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..