అమితాబ్‌ ఫాలో అయ్యేది ఆమెనే!

సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకునే అమితాబ్‌ బచ్చన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆయన్ని దాదాపు 38 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతుంటారు.

Published : 10 Mar 2024 00:15 IST

సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకునే అమితాబ్‌ బచ్చన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆయన్ని దాదాపు 38 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. మరి అమితాబ్‌ మాత్రం కేవలం ఒకే ఒకర్ని అనుసరిస్తున్నారు. అలాగని ఆ వ్యక్తి సెలబ్రిటీనో, కుటుంబ సభ్యురాలో కాదు. చూపులేని ఓ సామాన్యురాలు. ముంబయికి చెందిన ఆ అమ్మాయి పేరు అవ్నీ రాథీ. గతేడాది ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొని అమితాబ్‌కి మరింత దగ్గరైంది. ఉన్నత చదువులు చదువుకున్న అవ్నీ పాటలు రాసి పాడుతుంటుంది. వాద్య పరికరాలు వాయిస్తుంది. మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తుంటుంది. స్టేజీ షోలు కూడా చేస్తున్న అవ్నీ ఆత్మవిశ్వాసానికీ, ప్రతిభకీ మెచ్చిన అమితాబ్‌ ప్రశంసాపూర్వంగా ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాని ఫాలో అవుతున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..