వారికి ఉచితం

రోడ్డు పక్కనున్న ఓ ఫుడ్‌ ట్రక్‌ అది. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్‌లు ఆగుతున్నాయి. వాటిని నడిపే డ్రైవర్లు కొందరు తింటున్నారు.

Updated : 17 Mar 2024 22:13 IST

రోడ్డు పక్కనున్న ఓ ఫుడ్‌ ట్రక్‌ అది. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్‌లు ఆగుతున్నాయి. వాటిని నడిపే డ్రైవర్లు కొందరు తింటున్నారు. మరికొందరు పార్శిళ్లు తీసుకెళుతున్నారు. అలాగని అదేమన్నా అంబులెన్స్‌ డ్రైవర్ల కోసమే పెట్టిన ఫుడ్‌ కోర్టు ఏమీ కాదు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన కార్తికేయన్‌, అతని భార్య మనీష నడుపుతున్న ఫుడ్‌ ట్రక్‌ అది. అమెరికాలో ఎమ్మెస్‌ చదువుకుని వచ్చి బతుకుతెరువుకోసం ఆ ట్రక్‌ పెట్టుకున్నారు. ఒకసారి కార్తికేయన్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ అతణ్ని సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడాడు. అప్పట్నుంచీ ఆ వృత్తిని గౌరవిస్తూ అంబులెన్స్‌ డ్రైవర్లకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు కార్తికేయన్‌ దంపతులు. వాళ్లతోపాటు భారత సైన్యం రుణం కూడా తీర్చుకోలేనిదనే ఆ దంపతులు ఇండియన్‌ ఆర్మీలో పనిచేసేవారికీ, రిటైర్‌ అయినవారికీ కూడా ఉచితంగా కడుపునింపుతున్నారు. తిన్నంత తిని ఇంట్లో వాళ్లకు పార్శిల్‌ తీసుకెళ్లే అవకాశం కూడా కల్పించారు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్లూ, సైనికులూ ఎవరైనా మా ట్రక్‌ దగ్గర ఆతిథ్యం స్వీకరించొచ్చు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..