అమ్మలా చూసుకుంటారు!

పోలీసులకు నిర్ణీత పని వేళలంటూ ఉండవు. ఎక్కువ సమయం విధుల్లోనే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుండీ వారిని చూసుకునేవారెవరూ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది.

Published : 17 Mar 2024 00:13 IST

పోలీసులకు నిర్ణీత పని వేళలంటూ ఉండవు. ఎక్కువ సమయం విధుల్లోనే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుండీ వారిని చూసుకునేవారెవరూ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కారణం వల్ల ఉద్యోగాలు మానేసిన కానిస్టేబుళ్లను ఎందరినో తన సర్వీసులో చూశారు- 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారిణి స్వప్న మేష్రమ్‌. బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న ఆమె రెండు నెలల క్రితం పోలీస్‌ శాఖలో పని చేసే ఉద్యోగుల పిల్లల కోసం తన సొంత ఖర్చుతో ఓ క్రెచ్‌ను ప్రారంభించారు. అక్కడ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటలవరకూ ఆయాలతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లూ ఆ చిన్నారుల బాగోగులు చూస్తున్నారు. వైద్యులు కూడా రెండు పూటలా పిల్లల్ని చూసి వెళుతుంటారు. ఈ కేంద్రంలో ఉన్న సిబ్బంది పిల్లలకు ఆహారం అందించి ఆలనా పాలనా చూసుకోవడంతోపాటు హోమ్‌వర్క్‌లు కూడా చేయిస్తారు. ప్రస్తుతం ఔరంగాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీస్‌ ఉద్యోగులు దాదాపు యాభై మంది ఈ సేవలను వినియోగించుకుంటూ... పిల్లల గురించి చింత లేకుండా పని చేసుకుంటున్నారు. ఎస్పీ ఆలోచనకూ, తీసుకున్న చొరవకూ అధికారులు మెచ్చుకోవడంతోపాటు ప్రభుత్వ నిధుల్ని కేటాయించడానికి ఆదేశాలు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..