వానొస్తే డబ్బు వాపస్‌!

విహారయాత్రలకు కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్‌లో రూమ్‌ తీసుకుంటాం. తీరా అక్కడకు వెళ్లాక అనుకోకుండా వర్షం పడిందంటే బయటకు వెళ్లడం కష్టం.

Updated : 17 Mar 2024 05:01 IST

విహారయాత్రలకు కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్‌లో రూమ్‌ తీసుకుంటాం. తీరా అక్కడకు వెళ్లాక అనుకోకుండా వర్షం పడిందంటే బయటకు వెళ్లడం కష్టం. చూడాలనుకున్న ప్రదేశాలు చూడలేరు. సమయంతోపాటు ఛార్జీలూ, హోటల్‌ బిల్లులూ వృథా అయిపోతాయి. తమ హోటల్‌లో ఉన్న కస్టమర్లకు అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం బిల్లు రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది సింగపూర్‌కు చెందిన ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌. పర్యటకులు తరచుగా మొగ్గు చూపే సింగపూర్‌లో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. వాటివల్ల పర్యటకులు ఇబ్బంది పడటం గమనించిన ఆ హోటల్‌ యాజమాన్యం ఈ ఆఫర్‌నూ కొన్ని షరతులనూ ప్రకటించింది. ఏకధాటిగా రెండుగంటలపాటు వర్షం పడితేనే హోటల్‌ బిల్లును వోచర్‌ రూపంలో ఇస్తుంది. దాంతో మరోసారి అక్కడ బస చేయొచ్చన్నమాట. వర్షం ఆఫర్‌తో పర్యటకుల్ని ఆకట్టుకుంటూ ఆ సంస్థ భలే మార్కెటింగ్‌ స్ట్రాటజీని పాటిస్తోంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..