ఆపరేషన్‌ గరుడ!

పోలీస్‌ శాఖలో జాగిలాలనూ, గుర్రాలనూ వినియోగించడం మనకు తెలిసిందే. అందుకోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’(ఐఐటీఏ)లో వాటికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తుంటారు

Published : 24 Mar 2024 01:07 IST

పోలీస్‌ శాఖలో జాగిలాలనూ, గుర్రాలనూ వినియోగించడం మనకు తెలిసిందే. అందుకోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’(ఐఐటీఏ)లో వాటికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తుంటారు. ఈసారి ఆ జంతువులతోపాటు డేగలకు కూడా ట్రైనింగ్‌ ఇచ్చారు నిపుణులు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని నిఘా విభాగంలో చేరడానికి సిద్ధమైన ఆ డేగలు ఇక నుంచి అడవుల్లో కూంబింగ్‌ దళాలతో కలిసి విధులు నిర్వహిస్తాయి. అక్కడ మావోయిస్టులు అనధికారికంగా ఎగుర వేసే డ్రోన్లపై దాడి చేసి వాటిని తీసుకొచ్చి పోలీసు సిబ్బందికి ఇవ్వడమే వీటి పని. డేగలు- పావురాల కంటే వేగంగా ఎగురడంతోపాటు తుపాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులోకి వెళతాయి కాబట్టి నిఘా పనులకు వాటిని ఎంచుకుంది పోలీస్‌ శాఖ. నల్లమల అడవుల నుంచి తీసుకొచ్చి మొయినాబాద్‌ అడవుల్లో శిక్షణ ఇప్పించిన మూడు డేగలు- వేగంగా ఆకాశంలో ఎగిరే డ్రోన్లపై దాడి చేసి వాటిని తెచ్చి పోలీసులకు ఇస్తున్నాయి. ఇక మీదట వీటిని అడవుల్లోనే కాదు... డ్రోన్ల నిషేధం ఉన్నచోట కూడా కాపలా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ పోలీస్‌ అధికారులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..